రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో 23 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 16 SEP 2023 10:55AM by PIB Hyderabad

స్వ‌చ్ఛంద సంస్థ‌లు/  ప్రైవేటు పాఠ‌శాల‌లు /  రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యంతో 6వ త‌ర‌గ‌తి నుంచి  త‌ర‌గ‌తుల వారీగా గ్రేడెడ్ ప‌ద్ధ‌తిలో 100 కొత్త సైనిక్ పాఠ‌శాల‌ల ఏర్పాటుకు భార‌త ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ చొర‌వ కింద దేశ‌వ్యాప్తంగా ఉన్న 19 కొత్త సైనిక్ స్కూల్స్‌తో సైనిక్ స్కూల్స్ సొసైటీ అవ‌గాహ‌నా ఒప్పందం (ఎంఒయు)పై సంత‌కాలు చేసింది.
భాగ‌స్వామ్య విధానంలో కొత్త సైనిక్ స్కూళ్ళ‌ను తెర‌వ‌డానికి ద‌ర‌ఖాస్తుల మూల్యాంక‌నాన్నిక‌ఠినంగా చేప‌ట్టిన త‌ర్వాత భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో 23 కొత్త సైనిక స్కూళ్ళ‌ను ఏర్పాటు చేసేందుకు ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదాన్ని తెలిపారు. ఈ చొర‌వ వ‌ల్ల భాగ‌స్వామ్య విధానంలో ఇప్ప‌టికే  పాత స‌ర‌ళిలో ప‌ని చేస్తున్న 33 సైనిక స్కూల్స్ కాకుండా  కొత్త స్కూళ్ళ సంఖ్య‌ను సైనిక్ స్కూల్ సొసైటీ 42కు పెంచింది. 
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్ధుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం, సాయుధ ద‌ళాల‌లో చేర‌డంతో పాటు వారికి మెరుగైన ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించేందుకు 100 నూత‌న సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త వెనుక ఉన్న ల‌క్ష్యాలు.  నేటి యువ‌త‌ను రేప‌టి బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా తీర్చిదిద్ద‌డం ద్వారా దేశ నిర్మాణానికి ప్ర‌భుత్వంతో చేతులు క‌ల‌ప‌డానికి ప్రైవేటు రంగానికి కూడా ఇది అవ‌కాశం ఇస్తుంది. 
ఆమోదాన్ని పొందిన కొత్త సైనిక్ స్కూళ్ళ రాష్ట్రాలు/  యుటిల వారీ  జాబితాను  https://sainikschool.ncog.gov.in/ అన్న లిక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా చూడ‌వ‌చ్చు. 
ఈ  కొత్త సైనిక్ స్కూళ్ళు, సంబంధిత విద్యా బోర్డుల‌కు అనుబంధం కాకుండా, సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తూ,  భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో కొత్త సైనిక్ పాఠ‌శాల‌ల కోసం సొసైటీ నిర్దేశించిన నియ‌మాలు, నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తాయి . ఈ కొత్త సైనిక్ స్కూళ్ళు, సంబంధిత బోర్డు పాఠ్యాంశాల‌కు అద‌నంగా, వారు సైనిక్ స్కూల్ న‌మూనాలోని విద్యార్ధుల‌కు అక‌డ‌మిక్ ప్ల‌స్ పాఠ్యాంశాల‌తో కూడిన విద్య‌ను కూడా అందిస్తారు. ఈ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌, విధి విధానాల‌కు సంబంధించిన వివ‌రాలు https://sainikschool.ncog.gov.in/ అన్న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆస‌క్తి క‌లిగిన విద్యార్ధులు, త‌ల్లిదండ్రులు ఈ వెబ్ పోర్ట‌ల్‌ను సంద‌ర్శించి, ఈ నూత‌న అవ‌కాశం నుంచి ల‌బ్ధి పొంద‌వ‌ల‌సిందిగా ఆహ్వానించ‌డం జ‌రుగుతోంది.
 

***
 



(Release ID: 1958057) Visitor Counter : 122