బొగ్గు మంత్రిత్వ శాఖ
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రంగంలో పెద్ద ఎత్తున అమలు జరుగుతున్న పచ్చదనం అభివృద్ధి కార్యక్రమం
ఎకో-పార్కుల అభివృద్ధి , పర్యావరణ సంరక్షణకు బొగ్గు ఉత్పత్తి సంస్థలు అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
16 SEP 2023 10:44AM by PIB Hyderabad
బొగ్గు తవ్వకాలు నిలిపివేసిన ప్రాంతాలు, బొగ్గు నిల్వ చేస్తున్న ప్రాంతాలు, బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి చేయడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థల సహకారంతో నిరంతరం కార్యక్రమాలు అమలు చేస్తోంది.
తాజా సమాచారం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ప్రతి సంస్థలు దాదాపు 2338 హెక్టర్ల భూమిలో దాదాపు 48 లక్షలకు పైగా మొక్కలు నాటాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పదివేల హెక్టార్ల భూమిలో దాదాపు 2.24 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా బొగ్గు రవాణా చేయడం కోసం నిర్మించిన ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ రైల్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఎకో పార్కుల అభివృద్ధికి బొగ్గు ఉత్పత్తి సంస్థలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దెబ్బతిన్న భూమిని పునరుద్ధరించడానికి బొగ్గు కంపెనీలు ఎకో పార్కులను అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు
బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థలు అందుబాటులో ఉన్న భూమిని తిరిగి వినియోగంలోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు అమలు చేస్తున్నాయి. నిబంధన ప్రకారం అమలు చేయాల్సి ఉన్న "పరిహార అటవీ పెంపకం" కోసం పర్యావరణ, అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నాటిన మొక్కలను లెక్కలోకి తీసుకుంటుంది. నిబంధనల ప్రకారం దాదాపు 2800 హెక్టార్ల భూమిలో "అక్రెడిటెడ్ కాంపెన్సేటరీ ఫారెస్టెషన్ ఏరియా" కింద మొక్కలు పెంచడానికి బొగ్గు ఉత్పత్తి సంస్థలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు సమర్పించాయి. భవిష్యత్తులో బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్న అటవీ ప్రాంతాల్లో బొగ్గు వెలికి తీయడానికి తవ్వకం కార్యక్రమాలు ప్రారంభించడానికి "అక్రెడిటెడ్ కాంపెన్సేటరీ ఫారెస్టెషన్ ఏరియా" ను లెక్కలోకి తీసుకుంటారు.
అన్ని బొగ్గు అనుబంధ సంస్థలు నిరుపయోగ భూములను ఉపయోగంలోకి తేవడానికి / మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక సెల్‌ను కలిగి ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కేవలం తవ్వకాలు జరపడానికి మాత్రమే కాకుండా పర్యావరణహిత కార్యక్రమాల అమలుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.
***
(Release ID: 1957951)
Visitor Counter : 148