ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అమలు జరుగుతున్న చర్యలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పూణేలోని ఐసిఎంఆర్-ఎన్ఐవిని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి


క్షేత్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి 3 బిఎస్ఎల్ ల్యాబ్‌లతో కోజికోడ్ చేరుకున్న కేంద్ర, ఐసిఎంఆర్ బృందాలు

Posted On: 14 SEP 2023 7:02PM by PIB Hyderabad

కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అమలు జరుగుతున్న చర్యలను  కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమీక్షించారు. పూణెలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఐసిఎంఆర్-ఎన్ఐవి)  నుంచి ఈరోజు మంత్రి కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అమలు జరుగుతున్న చర్యలను సమీక్షించారు. 

సమీక్ష అనంతరం మాట్లాడిన మంత్రి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వ్యాధి నివారణకు అవసరమైన అన్ని చర్యలు అమలు చేస్తామని అన్నారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి  3 బిఎస్ఎల్ ల్యాబ్‌లతో  కేంద్ర, ఐసిఎంఆర్ బృందాలు కోజికోడ్ చేరుకున్నాయని  డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు.మొబైల్ యూనిట్లతో బిఎస్ఎల్ కూడిన ల్యాబ్స్  క్షేత్ర స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తాయి. కోజికోడ్ ప్రాంతంలో వ్యాధి గుర్తించినగ్రామ పంచాయతీలను క్వారంటైన్ జోన్‌లుగా ప్రకటించినట్లు ఆమె ప్రకటించారు. ఈ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రజారోగ్య చర్యలలో రాష్ట్రానికి పూర్తి సహకారం అందించడానికి  డాక్టర్ మాలా ఛబ్రా నేతృత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఒక  బృందాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్-ఎన్ఐవి  ప్రతిరోజూ ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నాయి.  వైరల్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 

 

***


(Release ID: 1957589) Visitor Counter : 104