నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక ప్రచారం 2.0, స్వచ్ఛత డ్రైవ్‌ను నిర్వహిస్తున్న నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్య కాలంలో 1,051 పారిశుద్ధ్య ప్రచారాలను విజయవంతంగా నిర్వహించి, 27,162 చదరపు అడుగుల చోటును ఖాళీ చేసి, తుక్కును విక్రయించి రూ. 25,69,693 ఆదాయాన్ని ఆర్జించారు
Posted On:
13 SEP 2023 9:05AM by PIB Hyderabad
నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రత్యేక ప్రచారం 2.0 జోరుగా సాగుతోంది.
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కనీస స్థాయికి తీసుకురావడం, స్వచ్ఛతను వ్యవస్థీకరించడం, అంతర్గతంగా పర్యవేక్షించే యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణను ఇవ్వడం, మెరుగైన రికార్డుల నిర్వహణ కోసం భౌతిక రికార్డులను డిజిటైజ్ చేయడం, అన్ని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు అన్నింటికి సంబంధించిన ఏకవేదిక ః డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. పిజిపోర్టల్. జిఒవి.ఐఎన్ (www.pgportal.gov.in/scdpm)లో మెరుగ్గా నిర్వహించడం అన్న లక్ష్యాలతో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ముందు చెప్పిన కాలంలో, 11000 భౌతిక ఫైళ్ళను సమీక్షించి, 864 ఫైళ్ళను తొలగించి, 61380 ప్రజా ఫిర్యాదులను, అప్పీళ్ళను పరిష్కరించి, 35 పారిశుద్ధ్య ప్రచారాలను నిర్వహించి, 5054 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసి, తుక్కును విక్రయించడం ద్వారా రూ. 24,49,293 ఆదాయాన్ని ఆర్జించారు.
***
(Release ID: 1957164)
Visitor Counter : 115