నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ (ఫైనాన్స్)గా శ్రీ జోషిత్ రంజన్ సికిదార్ బాధ్యతల స్వీకరణ
Posted On:
13 SEP 2023 3:08PM by PIB Hyderabad
12 సెప్టెంబర్ 2023న శ్రీ జోషిత్ రంజన్ సికిదార్ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (ఎస్.ఈ.సి.ఐ) డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ సికిదార్ చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ మరియు ఎంబీఏ (ఫైనాన్స్) పట్టబద్రుడు. 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఆయన సొంతం. డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియామకానికి ముందు శ్రీ సికిదార్ ఆర్.ఐ.టి.ఈ.ఎస్. లిమిటెడ్ గ్రూప్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) మరియు కంపెనీ సెక్రటరీగా పనిచేశారు. ఈయన మొత్తం పదవీకాలం ఆర్.ఐ.టి.ఈ.ఎస్.లో నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ, ఎన్.ఎస్.పి.సి.ఎల్ (ఎన్.టి.పి.సి & సెయిల్ సంయుక్త సంస్థ)లో 16 సంవత్సరాల కంటే ఎక్కువ. సెయిల్ - భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో తొమ్మిది సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఫైనాన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్, కార్పొరేట్ ఎక్స్‌పెండిచర్, కార్పొరేట్ టాక్సేషన్ సెల్, ట్రెజరీ ఫంక్షన్‌లు, ఎక్స్‌పోటెక్ ఫైనాన్స్, కంప్లయన్సెస్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్‌లో అనుభవం ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మినిరత్న కేటగిరీ-I సి.పి.ఎస్.యు, ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, భారత ప్రభుత్వం యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంది. ఫైనాన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్, కార్పొరేట్ ఎక్స్‌పెండిచర్, కార్పొరేట్ టాక్సేషన్ సెల్, ట్రెజరీ ఫంక్షన్‌లు, ఎక్స్‌పోటెక్ ఫైనాన్స్, కంప్లయన్సెస్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్‌లో అనుభవం ఉంది.. ప్రస్తుత దృష్టాంతంలో, పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధిలో ఎస్ఈసీఏ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంఎన్ఆర్ఈ అనేక పథకాల అమలు కోసం కంపెనీ ఒక నోడల్ ఏజెన్సీ. అదనంగా ఎస్ఈసీఏ అనేక పీఎస్యులు మరియు ప్రభుత్వ విభాగాల కోసం టర్న్‌కీ ప్రాతిపదికన సోలార్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌లోకి ప్రవేశించింది. కంపెనీ కేటగిరీ-1 పవర్ ట్రేడింగ్ లైసెన్స్‌ను కూడా కలిగి ఉంది. ఇది అమలు చేసే పథకాల కింద ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్‌ల ద్వారా ఉత్పత్తి చేయబడిన సౌర విద్యుత్తు వ్యాపారం ద్వారా ఈ డొమైన్‌లో చురుకుగా ఉంది.
***
(Release ID: 1957154)