ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భవ ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభించిన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము


ఈ చారిత్రాత్మక ప్రారంభం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్ సి) , అందరికీ ఆరోగ్య సంరక్షణ లక్ష్యాలను సాధించే దిశగా గణనీయమైన ముందడుగుకు సంకేతం. ముఖ్యంగా నిరుపేదలకు ఆరోగ్య సేవల అందుబాటు, తక్కువ ఖర్చుతో లభ్యతను ఇది భరోసా ఇస్తుంది: రాష్ట్రపతి

‘భారతదేశంలోని చివరి మైలు వరకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని విజయవంతంగా సాధించడంలో ఆయుష్మాన్ భవ్ ప్రచారం అనుసరించే బహుళ మంత్రిత్వ విధానం కీలక పాత్ర పోషిస్తుంది.‘

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'తో ఆయుష్మాన్ భవ్ ఆరోగ్య రంగంలో పెద్ద చొరవగా అవతరించనుంది; అందరినీ కలుపుకుని ఎవరినీ వదిలిపెట్టకూడదనే నినాదానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం: డాక్టర్ మాండవీయ

“ఆయుష్మాన్ భవ్ చొరవతో, ఆరోగ్య సంరక్షణను తక్కువ ఖర్చుకే అందుబాటులోకి తీసుకురావడంలో భారతదేశం కొత్త అధ్యాయాన్ని రాయబోతోంది; ఆయుష్మాన్ భవ్ కింద, ఆరోగ్య మేళాలు , వైద్య శిబిరాలు ఒక ముఖ్యమైన భాగం; వీటిని వారానికి ఒకసారి అన్ని హెచ్ డబ్ల్యూ సి, సి హెచ్ సి ల వద్ద నిర్వహిస్తారు.”

అందరికీ మెరుగైన ఆరోగ్యం, అందరికీ చికిత్స అందించేందుకు ఆయుష్మాన్ భవ కార్యక్రమం

Posted On: 13 SEP 2023 4:22PM by PIB Hyderabad

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు గుజరాత్ లోని గాంధీనగర్ రాజ్ భవన్ దార్శనిక 'ఆయుష్మాన్ భవ' ప్రచారాన్ని,  అలాగే ఆయుష్మాన్ భవ పోర్టల్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘేల్, గుజరాత్ ఆర్థిక మంత్రి శ్రీ కానుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశంలోని చివరి మైలు వరకు ఆరోగ్య సేవలను అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి ఆయుష్మాన్ భవ్ ప్రచారం అవలంబించిన బహుళ మంత్రిత్వ స్థాయి విధానాన్ని ప్రశంసించారు, ఈ ప్రయత్నం లక్ష్యాన్ని విజయవంతంగా సాధించడంలో  కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్.సి ) సాధించడానికి,  అందరికీ ఆరోగ్య సంరక్షణను నిర్ధారించే దిశగా ఈ చారిత్రాత్మక ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని, , ముఖ్యంగా నిరుపేదలకు ఆరోగ్య సంరక్షణ సేవల ప్రాప్యత తక్కువ ఖర్చు లభ్యత ను మరింత బలోపేతం చేయడానికి ఇది ప్రయత్నిస్తుందని అన్నారు..

"అంత్యోదయ" అంటే  'ఎవరినీ వదిలి పెట్టకుండా  అందరికీ మంచి ఆరోగ్యం‘ అందించాలనే భావన అని, ఈ ప్రయత్నంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం భాగస్వామ్యం మద్దతు  ప్రశంసనీయమని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. లక్ష్యాలను విజయవంతంగా సాధించిన గ్రామ పంచాయతీలను ఆయుష్మాన్ గ్రామ పంచాయితీలుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో నిర్దేశిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ పాత్రను , దాని నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రతి వ్యక్తికి అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2023 వరకు చేపడుతున్న సేవా పక్వాడ  చొరవను రాష్ట్రపతి ప్రశంసించారు.

ఆయుష్మాన్ కార్డుల ప్రాప్యతను మరింత సులభతరం చేయడం, అభా ఐడిలను జనరేట్ చేయడం,? అంటువ్యాధులు కాని వ్యాధులు, క్షయ , సికిల్ సెల్ వంటి ముఖ్యమైన ఆరోగ్య పథకాలు , వ్యాధి పరిస్థితుల గురించి అవగాహన పెంచడం మొదలైన ఆయుష్మాన్ భవ్ లక్ష్యాలను  రాష్ట్రపతి ప్రశంసించారు. ఆయుష్మాన్ భవ్ లోని మూడు భాగాలైన ఆయుష్మాన్ - అప్కే ద్వార్ 3.0, ప్రతి గ్రామం, పంచాయతీ లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లు (హెచ్ డబ్ల్యూ సి), కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ లు (సీహెచ్.సి ) ఆయిష్మాన్ మేళాలు, ప్రతి గ్రామం, పంచాయతీ లోఆయుష్మాన్ సభల ద్వారా ఆరోగ్య సేవలు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల అందుబాటును గణనీయంగా వేగవంతం చేస్తాయని, తద్వారా ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్రపతి అన్నారు.  ప్రతి గ్రామం ,  జిల్లాను డిజిటల్ చేరికలో భారతదేశం పొందిందని, ఇది ఆరోగ్య సౌకర్యాలను చేరుకోవడానికి గణనీయంగా సహాయపడుతుందని ఆమె తెలియచేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలలో రాష్ట్రపతి మద్దతును ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పిన ఆయన , "సబ్ కా సాత్ సబ్ కా వికాస్" తో ఆయుష్మాన్ భవ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక పెద్ద చొరవగా ఆవిర్భవిస్తుందని అన్నారు. 'అందరినీ కలుపుకుని ఎవరినీ వదిలిపెట్టకూడదు' అనే నినాదానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆయుష్మాన్ భవ్ చొరవతో, ఆరోగ్య సంరక్షణను తక్కువ ఖర్చు తో అందించడం లో భారతదేశం ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతోంది‘ అన్నారు.  ఆయుష్మాన్ భవ్ లో ఆరోగ్య మేళాలు , వైద్య శిబిరాలు ఒక ముఖ్యమైన భాగం అని, ఇవి అన్ని హెచ్ డబ్ల్యూ సి లు, సీహెచ్.సి  లలో వారానికి ఒకసారి ఏర్పాటు అవుతాయని తెలిపారు. ఆయుష్మాన్ భవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, అవయవదానం,  రక్తదాన ప్రతిజ్ఞ ప్రచారాలను కూడా నిర్వహిస్తామని, ఇవి ప్రతి వ్యక్తి చేపట్టాల్సిన గొప్ప కార్యక్రమాలు అని ఆయన అన్నారు. ఆరోగ్యకరమైన భారత్, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం ప్రధాన మంత్రి దార్శనికతను గుర్తుచేస్తూ,డాక్టర్ మాండవీయ,  "ప్రధాన మంత్రి మానవ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. దేశంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ఆయన నిబద్ధత కంటే మంచి నిదర్శనం మరొకటి ఉండదు. గతంలో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ప్రధాని నాయకత్వంలో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలను ఇకపై సి హెచ్ సి స్థాయిలోనే లభిస్తాయని, ఇందులో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్, టెలీ కన్సల్టేషన్, ఉచిత మందులు, డయాగ్నోస్టిక్స్ తదితరాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది” అన్నారు. 

ఈ చొరవకు అంగీకారం తెలిపిన 10 లక్షల మంది టీబీ రోగులకు ఈ రోజు సుమారు లక్ష నిక్షయ్ మిత్రలు చికిత్స అందిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2025 నాటికి టీబీని అంతమొందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి లక్ష్యానికి ఇది మనను మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు. 

ఆరోగ్య సంరక్షణ సేవల గణనీయమైన ప్రభావాన్ని ఆయన ప్రశంసించారు " గత 9 సంవత్సరాలలో, దేశం ఆరోగ్య సంరక్షణ రంగం లో గణనీయమైన మార్పు వచ్చింది, దీనిని జి 20 శిఖరాగ్ర సదస్సు కు హాజరైన ప్రముఖులు కూడా ప్రశంసించారు. నేడు, దేశంలో 1.6 లక్షలకు పైగా పనిచేసే ఎబి- హెచ్ డబ్ల్యూ సి లు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఉచిత ప్రాధమిక సంరక్షణ సౌకర్యాలు, రోగనిర్ధారణ , మందులను పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏబీ-హెచ్ డబ్ల్యూసీ లలో 195 కోట్లకు పైగా ఫూట్ ఫాల్ పొందాం‘ అన్నారు. 

ఎంపీలు, శాసనసభ్యులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 50 లక్షల మందికి పైగా కనెక్ట్ అయి ఆన్ లైన్ లో లాంచ్ ఈవెంట్ ను వీక్షించారు.

 

***



(Release ID: 1957152) Visitor Counter : 122