సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత ప్రత్యేక ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
13 SEP 2023 3:35PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, తన అనుబంధ, ఉప, స్వయంప్రతిపత్త సంస్థల ద్వారా 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఎస్‌సీడీపీఎం పోర్టల్‌లో నెలవారీ నివేదికలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేసింది.
2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు కాలంలో, అంతర్‌మంత్రిత్వ సంప్రదిపుల విభాగం (ఐఎంసీ) సూచనల్లో (మంత్రివర్గ ప్రతిపాదనలు) 100% పాటించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల్లో దాదాపు 82%, పీఎంవో సూచనల్లో 86%, ఎంపీల సూచనల్లో 73% పరిష్కరించింది. సమీక్ష కోసం కేటాయించిన మొత్తం భౌతిక దస్త్రాల్లో 71% దస్త్రాలను సమీక్షించింది. గుర్తించిన 66 స్వచ్ఛత ప్రచార ప్రాంతాల్లోని 56 ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.
2023 ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వచ్ఛత పఖ్వాడాను మంత్రిత్వ శాఖ పాటించింది. ఈ పక్షం రోజుల్లో, మంత్రిత్వ శాఖలోని అధికారులు, ఉద్యోగులంతా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అన్ని విభాగాలు, కార్యాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రత, దస్త్రాల సరైన నిర్వహణ కోసం స్వచ్ఛత తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు. శాస్త్రి భవన్ లోపల, కార్యాలయ చుట్టుపక్కల ప్రాంగణాన్ని అందంగా, శుభ్రంగా మార్చడానికి పరిశుభ్రత కార్యక్రమం/శ్రమదాన్ నిర్వహించారు.
***
(Release ID: 1957047)
Visitor Counter : 110