మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 15న జరగనున్నపిఎంఎంఎస్ వై 3వ వార్షికోత్సవంలో పాల్గొనున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా


అర్హులైన వారందరికీ ప్రయోజనం కలిగించే విధంగా ఆరు నెలల పాటు అమలు చేయనున్న "మత్స్య సంపద జాగృకత అభియాన్" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న శ్రీ రూపాలా

పిఎంఎంఎస్ వై కింద అమలు చేయనున్న ఉత్పత్తి,ఉత్పాదకత పెంపుదల, పంట అనంతర మౌలిక సదుపాయాలు, ఇతర విలువ ఆధారిత కార్యక్రమాలను ప్రారంభించనున్న శ్రీ పర్షోత్తమ్ రూపాలా

సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మత్స్య రంగం అభివృద్ధిలో సాధించిన అభివృద్ధి, అభివృద్ధి సాధనకు గల అవకాశాలపై స్టార్టప్‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు,మత్స్య ఎఫ్పిఓలు, మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల

Posted On: 13 SEP 2023 2:14PM by PIB Hyderabad

మూడు సంవత్సరాలుగా   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) విజయవంతంగా అమలు జరుగుతున్న సందర్భంగా 2023 సెప్టెంబర్  15న మధ్యప్రదేశ్‌లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా పాల్గొని ప్రసంగిస్తారు.  ఆరు నెలలపాటు కేంద్ర మత్స్యశాఖ అమలు చేయనున్న  "మత్స్య సంపద జాగృకత అభియాన్" కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభిస్తారు,మత్స్య శాఖ కార్యక్రమాలను  సమర్థవంతంగా అమలు చేయడం, అర్హులైన వారందరికీ  పథకాల ప్రయోజనాలను కలిగించడం  లక్ష్యంగా "మత్స్య సంపద జాగృకత అభియాన్"  అమలు జరుగుతుంది.   "మత్స్య సంపద జాగృకత అభియాన్" కింద   సెప్టెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు దేశవ్యాప్తంగా 108 మత్స్య కిసాన్ సమ్మేళన్ లను నిర్వహిస్తారు. ఈ పథకం ప్రయోజనాలపై లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించడమే లక్ష్యంగా జరిగే కార్యక్రమం కింద  2.8 కోట్ల మందికి అవగాహన కల్పిస్తారు.  చేపల పెంపకందారులు, 3477 తీరప్రాంత గ్రామాలు, మత్స్య రంగం  బహుముఖ ప్రాధాన్యత అంశం,  మత్స్యకారులు,చేపల పెంపకందారులకు పిఎంఎంఎస్ వై కింద అందుతున్న సహకారం, మత్స్య శాఖ, శాఖ కింద పనిచేస్తున్న సంస్థలు గత  తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన  విజయాలు , విజయగాథల  సమాచారం, జ్ఞానాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం లక్ష్యంగా "మత్స్య సంపద జాగృకత అభియాన్" అమలు జరుగుతుంది. 

ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, పంట అనంతర మౌలిక సదుపాయాలు, ఇతర విలువ గొలుసు పెంపు కార్యక్రమాల కోసం పిఎంఎంఎస్ వై   కింద ఆమోదించిన  వివిధ ప్రాజెక్టులను శ్రీ పర్షోత్తం రూపాలా కూడా ప్రారంభిస్తారు. సమావేశంలో ప్రధాన ఆకర్షణగా మత్స్య రంగం అభివృద్ధిలో సాధించిన అభివృద్ధి, అభివృద్ధి సాధనకు గల అవకాశాలపై  స్టార్టప్‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు,మత్స్య ఎఫ్పిఓలు, మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల  నిలుస్తుంది. . ప్రారంభోత్సవ  తర్వాత  పిఎంఎంఎస్   కింద సాధించిన విజయాలపై చర్చ జరుగుతుంది. ఇందులో వివిధ మత్స్యకార కార్యకలాపాలలో అనుబంధించబడిన లబ్ధిదారులు, చేపల రైతులు తాము సాధించిన విజయాన్ని వివరిస్తారు. హైబ్రిడ్ విధానంలోజరిగే సమావేశంలో  దేశవ్యాప్తంగా 20,000 మంది కంటే ఎక్కువ మంది పాల్గొంటారని భావిస్తున్నారు. మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, పారిశ్రామికవేత్తలు ఇతర వాటాదారులు, ప్రభుత్వ అధికారులు, ఉత్సాహభరితమైన మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలకు చెందిన వారిని ఒక వేదిక మీదకు తీసుకురావడానికి సమావేశం ఏర్పాటయింది.  కార్యక్రమంలో  పిఎంఎంఎస్ కింద సాధించిన విజయాలు, కేంద్ర మత్స్య శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.  దేశంలో మత్స్య రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల కాలంలో అందించిన  సహకారం, సాధించిన విజయాలు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.  

దేశంలో మత్స్య రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాధించిన అభివృద్ధి అంశాలపై   కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ సహాయ  మంత్రి    డాక్టర్. సంజీవ్ కుమార్ బల్యాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, మధ్యప్రదేశ్ మత్స్య  జలవనరుల శాఖ మంత్రి  శ్రీ. తులసి సిలాలావత్ ప్రసంగిస్తారు.  మత్స్య శాఖ, మత్స్య, పశుసంవర్ధక శాఖ సంయుక్త  సెక్రటరీ, శ్రీమతి నీతూ ప్రసాద్, చీఫ్ ఎగ్జిక్యూటివ్/NFDB, డా. ఎల్. నరసింహ మూర్తి,   డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్), ఐసిఎఆర్ డాక్టర్ జె.కె. జెనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  మత్స్య శాఖ ప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులు, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్,ఐసిఏఆర్ సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు/మంత్రిత్వ శాఖలు,పిఎంఎంఎస్ వై   లబ్ధిదారులు, మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, పారిశ్రామికవేత్తలు, దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ రంగానికి చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు.  మత్స్య శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలను  నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డిబి), హైదరాబాద్  సమన్వయం చేస్తోంది.

 ఆహారం, పోషకాహారం, ఉపాధి కల్పన రంగంలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.  దేశంలో సుమారు 3 కోట్ల మంది మత్స్యకారులు , చేపల పెంపకం దారులకు ఈ రంగం  జీవనోపాధికి అందిస్తోంది. . ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం 3వ అతిపెద్ద చేపల  ఉత్పత్తి చేస్తున్న దేశంగా గుర్తింపు పొందింది.  ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది.  రొయ్యల ఉత్పత్తి, సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసే అగ్ర దేశాలలో ఒకటి. గత తొమ్మిదేళ్ల కాలంలో మత్స్య రంగం, ఆక్వాకల్చర్ రంగం  సమగ్ర అభివృద్ధికి కేంద్ర  ప్రభుత్వం అనేక  కార్యక్రమాలు అమలు చేసింది. . రూ. 5000 కోట్లుపెట్టుబడితో బ్లూ రివల్యూషన్ స్కీమ్‌ను ప్రారంభించడం ద్వారా మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో పెట్టుబడులు పెంచడంలాంటి  ముఖ్య కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. రూ. 7522 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో    ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (FIDF) ఏర్పాటయింది.  , జూన్ 2019లో మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ కోసం కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక  మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.

మార్చి 2020లో నీలి విప్లవం పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, నీలి విప్లవం సాధించిన  విజయాలను ఏకీకృతం చేసి  ఉత్పత్తి మరియు ఉత్పాదకత ను పెంపొందిస్తూ మత్స్య రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి, మత్స్యకారుల సంక్షేమం తో మత్స్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలు నెరవేర్చాలనే దృక్పథంతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై ) 2020 సెప్టెంబర్ 10  న  ప్రారంభమైంది.   2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 5 సంవత్సరాల కాలానికి 20,050 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పథకం అమలు జరుగుతుంది. . చేపల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడం, మత్స్య విలువ గొలుసుఅభివృద్ధి కోసం  మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, దేశవ్యాప్తంగా దేశీయ చేపల వినియోగాన్ని పెంపొందించడం, ముఖ్యంగా మత్స్యకార సంఘాల జీవనోపాధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ స్థిరమైన అభివృద్ధి కోసం మత్స్య శాఖ  పిఎంఎంఎస్ వై   ని అమలు చేస్తోంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో చేపల ఉత్పత్తి , ఉత్పాదకత, సాంకేతిక, పంటకోత అనంతర మౌలిక సదుపాయాలు మొదలైన వాటిలో క్లిష్టమైన సమస్యలు పరిష్కరించాలి అన్న లక్ష్యంతో పిఎంఎంఎస్ వై అమలు జరుగుతోంది.  . 2020-21 నుంచి 2023-24 (ఆగస్టు 2023) వరకు పిఎంఎంఎస్ వై  కింద కేంద్ర మత్స్య శాఖ 16,924.02 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనిలో  కేంద్ర ప్రాయోజిత పథకాలు (రూ.15,335.09 కోట్లు),  కేంద్ర రంగ పథకాలు (రూ.1,588.93 కోట్లు) ఉన్నాయి. 

***



(Release ID: 1957007) Visitor Counter : 93