రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ప్రతి నెల సగటున 80కి పైగా పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతకు కట్టుబడి ఉన్న రక్షణ విభాగం

प्रविष्टि तिथि: 12 SEP 2023 4:34PM by PIB Hyderabad

కార్యాలయాల్లో పరిశుభ్రతను పెంచే ప్రచారంలో భాగంగా, 2023 జనవరి నుంచి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా మొత్తం 655 పరిశుభ్రత ప్రచారాలను రక్షణ విభాగం (డీవోడీ) నిర్వహించింది. కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం, ఖాళీ ప్రాంతాల నిర్వహణ, ఆరోగ్యకరమైన పని ప్రదేశం, ఆదాయాన్ని పెంచడానికి ఈ ప్రచారాలు ఉపయోగపడ్డాయి.

2023 జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ విభాగం చేపట్టిన స్వచ్ఛత ప్రయత్నాల ఫలితంగా 53,698 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఆ స్థలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను అమ్మడం వల్ల రూ.76.92 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ప్రచారాల కింద డీజీడీఈ, డీజీఏఎఫ్‌ఎంఎస్‌, డఈజీబీఆర్‌, డీజీడీఏ, సీఎస్‌డీ సహా అన్ని అనుబంధ, అధీన కార్యాలయాల్లో అనవసరమైన ఫైళ్లను తొలగించడం, వ్యర్థాలను అమ్మడం, కార్యాలయాల లోపల, బయట పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం వంటి వివిధ కార్యకలాపాలు చేపట్టారు.

గత ఏడాది అక్టోబర్‌లో చేపట్టిన స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 2.0లో మొత్తం 5,922 ప్రాంతాల్లో పరిశుభ్రత చేపట్టిన రక్షణ విభాగం, అత్యుత్తమ ప్రదర్శన చేసిన విభాగాల్లో ఒకటిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా, స్వచ్ఛత అనేది సంవత్సరానికి ఒకసారి చేసే కార్యక్రమంగా కాకుండా, రక్షణ విభాగం రోజువారీ పనిలో అంతర్భాగంగా మారింది. పరిశుభ్రమైన పని ప్రాంతాన్ని ప్రోత్సహించడం, వనరుల సరైన వినియోగం, పెండింగ్‌లో ఉన్న విషయాలను వేగంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టి, తన కార్యాలయాల్లో స్వచ్ఛతను విధుల్లో భాగంగా మార్చింది. ఇది, రక్షణ విభాగం నిబద్ధతను స్పష్టం చేస్తుంది.

రక్షా మంత్రి గత సంవత్సరం చెప్పినట్లుగా, మహాత్మాగాంధీ ప్రారంభించిన పరిశుభ్రత కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. భౌగోళిక హద్దులను దాటి మన దేశంలోని ప్రతి మూలకు అది చొచ్చుకుపోయింది.

 

***


(रिलीज़ आईडी: 1956857) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil