మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యుయర్షిప్ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామితో కలిసి విద్యా సమీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.

అలాగే 141 పిఎం శ్రీ పాఠశాలలు, 40 పడకల నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

విద్యా సమీక్షా కేంద్ర , ఉత్తరాఖండ్ లోని 23.50 లక్షల పాఠశాలల విద్యార్థులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే దిశగా తీసుకున్న చురుకైన చర్య: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

141 పిఎం శ్రీ పాఠశాలలు, అత్యుత్తమ స్థాయిలో పనిచేసే విధంగా రాష్ట్రంలోని ప్రస్తుత పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తాయి.: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

ఎన్.ఇ.పి 2020, 2021 వ శతాబ్దంలో విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవ్థను నిర్మించేందుకు రూపొందించిన ఒక తాత్విక డాక్యుమెంట్.: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 12 SEP 2023 3:32PM by PIB Hyderabad

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యుయర్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామితో కలిసి విద్యా సమీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 141 పిఎం శ్రీ పాఠశాలలకు శంకుస్థాపన,
ఉత్తరాఖండ్ లోని  డెహ్రాడూన్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ పాఠశాలకు వీరు శంకుస్థాపన చేశారు. సీనియర్ అధికారులు, పలువురు ప్రముఖులు, పలువురు విద్యావేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారని ఉద్దేశించి మాట్లాడులూ శ్రీ ప్రధాన్, విద్యా సమీక్షా కేంద్ర అనేది సాంకేతికత ఆధారిత, ఆధునిక గణాంక చోదిత నమూనా అని  చెప్పారు.  ఉత్తరాఖండ్ లోని 23.50 లక్షల పాఠశాలలో అభ్యసన
ఫలితాలను మరింత మెరుగుపరచడానికి తీసుకున్నవాటిలో చురుకైన చర్యగా ఆయన దీనిని అభివర్ణించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా సమీక్షా కేంద్రాలను గుజరాత్ లో ఎలా ప్రవేశపెట్టిందీ ఆయన వివరించారు.
ఎన్.ఇ.పి 2020 ని ప్రవేశపెట్టిన తర్వాత, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. ఉత్తరాఖండ్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా, గుజరాత్ విద్యా నమూనా కు అనుగుణంగానే ఉత్తరాఖండ్ కూడా విద్యా సమీక్షా కేంద్రను ప్రారంభించినట్టయిందని తెలిపారు.

పనితీరు, హాజరు వంటి వాటి గణాంకాలు కాకుండా, దీక్షా పోర్టల్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ (డి.ఐ.ఇ.టి), రాష్ట్రంలోని పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారం, ప్రభుత్వ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది.
ఎన్.ఇ.పి 2020 ఒక తాత్విక పత్రమని, ఇది 21 శతాబ్దపు  విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను  నిర్మిస్తుందన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడుతున్న  141 పిఎం శ్రీ పాఠశాలలు, రాష్ట్రంలోని ప్రస్తుత పాఠశాలలకు ఆదర్శ పాఠశాలలుగా రూపుదిద్దుకోనున్నట్టు చెప్పారు.
నేతాజి సుభాష్ చంద్ర బోస్ రెసిడెన్షియల్ పాఠశాల సమాజంలోని అణగారిన వర్గాల వారికి ఎంతో ఉపయోగపడనుంది.

 నేషనల్ రిసెర్చి ఫౌండేషన్ కింద రాష్ట్రస్థాయి టీచర్లు తమ రిసెర్చి ప్రాజెక్టులకు గ్రాంట్లు అందుకుంటున్నట్టుగా , రిసెర్చి స్కాలర్షిప్లను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రినికూడా ఆయన అభినందించారు.
ఇవాళ విద్యార్థులకు అందజేసిన స్కాలర్షిప్లు, విద్యా వ్యవస్థను రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదని అన్నారు.
ఎన్.ఇ.పి 2020ని అమలు చేయడంలో , ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి  ఉత్తరాఖండ్  రాష్ట్ర విద్యాశాఖ అందించిన సహకారానికి ఆయన అభినందనలు తెలిపారు.

ఇండియా అధ్యక్షతన  విజయవంతంగా జరిగిన జి 20 శిఖరాగ్ర సమ్మేళనం గురించి మాట్లాడుతూ శ్రీ ప్రదాన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్.ఇ.పి 2020 ని అంతర్జాతీయ నమూనాగా పరిచయం చేశారన్నారు. దీనిని సభ్యదేశాలు , అంతర్జాతీయ సంస్థలు  ఎలా అభినందించాయో తెలిపారు.
ఇది 30 కోట్ల మంది భారతీయ విద్యార్థులకే  కాక, ప్రపంచంలోని విద్యార్థులందరికీ ప్రమాణాలు నిర్దేశించి ప్రయోజనం కలిగిస్తుందన్నారు.

అనంతరం కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరాఖండ్లోని బిధోలి లోగల పెట్రోలియం ఇంధన అధ్యయనాల విశ్వవిద్యాలయం లో అమృత్ కాల్ డైలాx హాజరయ్యారు.. 

 

***


(Release ID: 1956855) Visitor Counter : 187


Read this release in: English , Urdu , Hindi , Odia , Kannada