సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఐగాట్ (iGOT) కర్మయోగి వేదికపై ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ లైవ్
प्रविष्टि तिथि:
12 SEP 2023 1:39PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో కర్మయోగి భారత్ ఎస్పీవీ ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ అధికారుల సామర్థ్య అభివృద్ధి వ్యవస్థ ఐగాట్ (iGOT) ఆకాంక్షాత్మక బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ)కి అంకితమైన కొత్త క్యూరేటెడ్ సేకరణను ప్రారంభించింది. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం విజయవంత కావడంతో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. 500 గుర్తించబడిన బ్లాక్లలో 5000 మంది బ్లాక్-లెవల్ అధికారుల క్రియాత్మక, డొమైన్ మరియు ప్రవర్తనా సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ సేకరణ ప్రయత్నిస్తుంది, వారి విధులు మరియు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి కీలకమైన విషయాలతో అభ్యాసకులకు పరిచయం చేస్తుంది. క్యూరేటెడ్ మాడ్యూల్ ద్వారా, ఐగాట్ (iGOT) వేదిక తక్కువ సేవలందిస్తున్న బ్లాక్‌ల పరివర్తనకు.. బ్లాక్ అధికారుల సహకారాన్ని మెరుగుపరచడానికి, మరియు ఎనేబుల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా భారతదేశం అంతటా అట్టడుగు స్థాయి పాలనను మెరుగుపరుస్తుంది. ఇందులో చేర్చబడిన 10 కోర్సులు:
1. సమయ నిర్వహణ (డి.ఒ.పి.టి); 2. సిటిజన్ సెంట్రిసిటీ కోసం కమ్యూనికేషన్ (డి.ఒ.పి.టి); 3. నాయకత్వం (డి.ఒ.పి.టి); 4. మిషన్ లైఫ్పై ఓరియంటేషన్ మాడ్యూల్ (పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ); 5. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఐఎస్టీఎం); 6. సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకోవడం (డి.ఒ.పి.టి); 7. స్వీయ-నాయకత్వం (ది ఆర్ట్ ఆఫ్ లివింగ్); 8. ఒత్తిడి నిర్వహణ (డి.ఒ.పి.టి); 9. కార్యాలయంలో యోగా విరామం (మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా), మరియు 10. టీమ్ బిల్డింగ్ (డి.ఒ.పి.టి).
ఐగాట్ (iGOT) కర్మయోగి (https://igotkarmayogi.gov.in/) అనేది ప్రభుత్వ అధికారులకు వారి సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయాణంలో మార్గనిర్దేశం చేసేందుకు ఒక సమగ్రమైన ఆన్లైన్ పోర్టల్. ఆన్లైన్ లెర్నింగ్, సామర్థ్య నిర్వహణ, కెరీర్ మేనేజ్మెంట్, చర్చలు, ఈవెంట్లు మరియు నెట్వర్కింగ్ కోసం పోర్టల్ 6 ఫంక్షనల్ హబ్లను మిళితం చేస్తుంది. ప్రభుత్వ స్పెక్ట్రమ్లోని 22.2 లక్షల మంది అభ్యాసకులు ప్రస్తుతం 685+ కోర్సులకు యాక్సెస్ను కలిగి ఉన్న ఐగాట్ (iGOT) వేదికపై నమోదు చేసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 1956763)
आगंतुक पटल : 188