వ్యవసాయ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో 'రైతు హక్కులపై తొలి గ్లోబల్ సింపోజియం'ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
రైతులు అన్నదాతలు: అన్నం ఉంటేనే శరీరం ఉంటుంది: శరీరం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది, అందుకే రైతులకు వందనం చేయాలి; వారి హక్కులను, భవిష్యత్తును కాపాడటం మన కర్తవ్యం - భారత రాష్ట్రపతి
అనేక మొక్కల వంగడాలను జాగ్రత్తగా సంరక్షించి అభివృద్ధి చేస్తున్న మన రైతుల కృషి వల్ల మన దేశ గొప్ప వ్యవసాయ వారసత్వం సుసంపన్నం అయింది: - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
12 SEP 2023 3:34PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ లోని ఐ సి ఎ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రైతుల హక్కులపై తొలి 'గ్లోబల్ సింపోజియం‘(జీఎస్ ఎఫ్ ఆర్ ) ను ప్రారంభించారు. ఆహ్వానించిన భారతీయ రైతులకు 'ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీస్' అవార్డు (6), 'ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్స్ రివార్డ్' (16), 'ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్స్ రికగ్నిషన్' (4) అవార్డులను రాష్ట్రపతి ముర్ము ప్రదానం చేశారు. పిపివిఎఫ్ఆర్ చట్టం, 2001 నిబంధనల కింద పిపివిఎఫ్ఆర్ అథారిటీ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. నూతనంగా నిర్మించిన 'ప్లాంట్ అథారిటీ భవన్', పీపీవీఎఫ్ఆర్ అథారిటీ కార్యాలయం, ఆన్లైన్ ప్లాంట్ వెరైటీ 'రిజిస్ట్రేషన్ పోర్టల్'ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీమతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో, సుసంపన్నమైన వ్యవసాయ, సాంస్కృతిక జాతి వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశాన్ని సముచితంగా ఎంచుకున్నందుకు నిర్వాహకులు అయిన ఎఫ్ ఎ ఒ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ట్రీటీ) సెక్రటేరియట్ ను అభినందించారు.
భారత సంస్కృతి, సంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయిన "వసుధైవ కుటుంబకం" (ప్రపంచమే ఒక కుటుంబం) అనే దేశంలో ఆమె ప్రతినిధులకు స్వాగతం పలికారు. రైతులు కష్టపడి భూజాతులు, అడవి జాతులు, సంప్రదాయ రకాల పంటలను అభివృద్ధి చేశారని, ఆధునిక పంటల పెంపక కార్యక్రమాలకు బిల్డింగ్ బ్లాక్ లను అందించారని, తద్వారా మానవులకు, జీవరాశులకు ఆహారం, పౌష్టికాహార భద్రత లభిస్తుందని ఆమె అన్నారు. జి ఎఫ్ ఎస్ ఆర్ నిర్వహించడం చాలా సముచితమని, రైతులు ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు (అన్నదాత ) అని, ఆహారం ఉంటేనే శరీరం ఉంటుందని, శరీరం ఉంటే ఏ పనైనా జరుగుతుందని ఆమె అన్నారు. అందుకే రైతులకు సెల్యూట్ చేసి వారి హక్కులను, భవిష్యత్తును కాపాడుకోవడం మన కర్తవ్యం అని పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ భారత రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ, న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్ ఎ ఒ అంతర్జాతీయ ఒప్పందం పాలక మండలి తొమ్మిదవ సెషన్ (సెప్టెంబర్ 17 నుండి 24, 2022 వరకు) లో భారత ప్రభుత్వం ప్రతిపాదించిన జి ఎఫ్ ఎస్ ఆర్ ను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ (డి ఎ అండ్ ఎఫ్ డబ్ల్యూ) ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ (పి పి వి ఎఫ్ ఆర్) అథారిటీ సహకారంతో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) , ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ బి పి జి ఆర్) భాగస్వామ్యం తో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణ కేవలం కర్తవ్యం మాత్రమే కాదని, జీవావరణ వ్యవస్థల మనుగడకు చాలా అవసరమని ఆయన అన్నారు.
అనేక మొక్కల వంగడాలను జాగ్రత్తగా పెంచి పోషించిన మన రైతుల కృషి వల్ల మన దేశం గొప్ప వ్యవసాయ వారసత్వం వర్ధిల్లింది. ఈ రకాల మొక్కలు జీవనోపాధికి వనరుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, సంస్కృతికి మధ్య ఉన్న లోతైన సంబంధానికి సజీవ నిదర్శనమని ఆయన అన్నారు.
ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, 2001 ద్వారా ప్లాంట్ వెరైటీ రిజిస్ట్రేషన్ నేపథ్యంలో రైతుల హక్కులను చేర్చిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని డీఏ అండ్ ఎఫ్ డబ్ల్యూ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా తెలిపారు. పీపీవీఎఫ్ఆర్ అథారిటీ చైర్ పర్సన్ డాక్టర్ టి.మహాపాత్ర స్వాగతోపన్యాసం చేస్తూ జీఎఫ్ఎస్ఆర్ ఆవిర్భావం, ఆకాంక్షలను వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమాన్షు పాఠక్, సెక్రటరీ.(డి ఎ ఆర్ ఇ) , డాక్టర్ ఆర్ఎస్ పరోడా, చైర్మన్, ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) , మాజీ కార్యదర్శి డి ఎ ఆర్ ఇ అండ్ డి జి , ఐసీఏఆర్, కెంట్ నాడోజీ, సెక్రటరీ, ఐ టి పి జి ఆర్ ఎఫ్ ఎ, తకాయుకి హగివారా, భారత్ లో ఎఫ్ ఎ ఒ ప్రతినిధి కూడా పాల్గొన్నారు.
2023 సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరిగే జీఎఫ్ఎస్ఆర్ సదస్సుకు అంతర్జాతీయ ఒప్పంద జాతీయ ముఖ్య ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అంతర్ ప్రభుత్వ , ప్రభుత్వేతర సంస్థలు, న్యాయ నిపుణులు , పౌర సమాజం సహా 59 దేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. సృజనాత్మక విధానాలు, సమర్థవంతమైన విధానాలు, ఉత్తమ పద్ధతులు, పరిజ్ఞానం , రైతుల హక్కులను అమలు చేయడంలో అనుభవ భాగస్వామ్యంపై చర్చల ద్వారా ఒప్పందంలోని భాగస్వామ్య పక్షాలు రైతుల హక్కులను అమలు చేయడానికి ఈ తరహా మొట్టమొదటి సింపోజియం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులను వ్యవసాయ జీవవైవిధ్య సంరక్షకులుగా, ప్రపంచ ఆహార భద్రత సంరక్షకులుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడానికి గ్లోబల్ సింపోజియం ఒక వేదికను అందిస్తుంది.
***
(Release ID: 1956758)
Visitor Counter : 173