నీతి ఆయోగ్

పెండింగ్ అంశాల పరిష్కారం, స్వచ్ఛత కోసం ప్రత్యేక ప్రచారం 2.0 అమలు చేసిన నీతి ఆయోగ్

Posted On: 12 SEP 2023 10:14AM by PIB Hyderabad

పెండింగ్ అంశాల పరిష్కారం, స్వచ్ఛతతో  'స్వచ్ఛ భారతదేశం' తో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడానికి పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏ ఆర్ పి జి) 2021 అక్టోబర్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవంతమైన కార్యక్రమాన్ని 2022,2023లో కూడా కొనసాగించాలని పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్ణయించింది. 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు  ప్రత్యేక ప్రచారం 2.0 అమలు జరిగింది.  ప్రజల ఫిర్యాదులను సకాలంలో  ప్రభావవంతంగా పరిష్కరించి, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలతో ఏర్పాటైన  మంత్రివర్గ సంప్రదింపుల కమిటీలు నుంచి అందిన సూచనలు, పార్లమెంట్ లో ఇచ్చిన   హామీలు అమలు జరిగేలా చూసేందుకు ప్రత్యేక ప్రచారం 2.0 అమలు జరిగింది. 

 పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం సూచనల మేరకు నీతి ఆయోగ్ లో ప్రత్యేక ప్రచారం 2.0 విజయవంతంగా అమలు జరిగింది. పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం, స్వచ్ఛత లక్ష్యంగా ప్రత్యేక ప్రచారం 2.0  అమలు జరిగింది. 

నీతి ఆయోగ్ కార్యాలయం,  దాని అనుబంధ కార్యాలయాలు డెవలప్‌మెంట్ మానిటరింగ్,ఎవాల్యుయేషన్ ఆఫీస్, వీతి  భవన్‌లో ఉన్న అటల్ ఇన్నోవేషన్ మిషన్,అటల్ ఇన్నోవేషన్ మిషన్ కు అనుబంధంగా  స్వయంప్రతిపత్తి  సంస్థగా పనిచేస్తున్న . నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, నరేలా, న్యూఢిల్లీలో కార్యక్రమం అమలు జరిగింది. . పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖల  సంప్రదింపులు, మంత్రిత్వ శాఖలు/విభాగాల ద్వారా అందిన  పార్లమెంట్ హామీల నుంచి ప్రజా ఫిర్యాదులను సకాలంలో,ప్రభావవంతంగా పరిష్కరించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరిగింది.  స్వచ్ఛ భారత్ అభియాన్ “ప్రత్యేక ప్రచారం 2.0” లో రికార్డుల  నిర్వహణ, పరిశుభ్రత (లోపల,బయట), కార్యాలయంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, అదనపు స్థలాన్ని అందుబాటులోకి తేవడం లాంటి కార్యక్రమాలు  నీతి ఆయోగ్‌లో అమలు జరిగాయి. 

 ప్రత్యేక ప్రచారం 2.0 అమలుతో   ప్రజా ఫిర్యాదులు, పార్లమెంటరీ హామీలు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన  సూచనల పరిష్కారం ఊపందుకుంది. రికార్డుల నిర్వహణలో భాగంగా  గణనీయమైన సంఖ్యలో ఫైళ్లను అధికారులు సమీక్షించి పనికిరాని ఫైళ్లను తొలగించారు.కార్యాలయంలో అదనపు స్థలం అందుబాటులోకి వచ్చింది. వ్యర్థాల అమ్మకం  ద్వారా ఆదాయం సమకూరింది. సమీక్ష కోసం గుర్తించిన ఫైళ్లలో 75% కంటే ఎక్కువ ఫైల్‌లు అధికారులు పరిశీలించారు.  ప్రత్యేక ప్రచారం 2.0 అమలు చేసిన   కాలంలో దాదాపు 95% ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కారం అయ్యాయి.  పారవేయడం కోసం అనవసరమైన వస్తువులు,వాడుకలో లేని వస్తువులను అధికారులు గుర్తించారు. 

లక్ష్యాలు, సాధించిన   విజయాలు, నిర్వహించిన  కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలను  పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఎస్సిడీ పీఎం పోర్టల్‌లో నీతి  ఆయోగ్ పొందుపరిచింది. 

 

ముందు                                                                                                                        తర్వాత 

 

         

        

               

              

***



(Release ID: 1956573) Visitor Counter : 143