వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (డి) కింద ఇటీవల నిర్వహించిన ఇ-ఆక్షన్ ద్వారా 1.66 ఎల్ఎంటి గోధుమలు, 0.17 ఎల్ఎంటి బియ్యాన్ని విక్రయించిన కేంద్రం
గరిష్ట భాగస్వామ్యంతో పాటుగా చిన్న, సన్న తుది వినియోగదారులను ప్రో త్సహించేందుకు ఇ-వేలాల ద్వారా చిల్లర ధరలను తగ్గించడం లక్ష్యం
Posted On:
11 SEP 2023 10:53AM by PIB Hyderabad
బియ్యం, గోధుమలు, గోధుమ పిండి చిల్లర ధరలను నియంత్రించేందుకు మార్కెట్ జోక్యం అన్న భారత ప్రభుత్వ చొరవలో భాగంగా గోధుమ, బియ్యం రెండింటికీ వారానికొకసారి వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం 2023-24లో 11వ ఇ-వేలాన్ని 06.09. 2023న నిర్వహించారు. దాదాపు 500 డిపోల నుంచి 2.0 ఎల్ఎంటి గోధుమలను, 337 డిపోల నుంచి 4.89 ఎల్ఎంటి బియ్యాన్ని దేశవ్యాప్తంగా వేలానికి అందచేశారు.
ఈ ఇ-ఆక్షన్‌లో 1.66 ఎల్ఎంటిల గోధుమలు, 0.17 ఎల్ఎంటి బియ్యం విక్రయం జరిగింది. వెయిటెడ్ సగటు విక్రయపు సగటు ధరను ఎఫ్ఎక్యూ గోధుమలు క్వింటాలుకు రూ. 2169.65కు భారతదేశ వ్యాప్తంగా రిజర్వ్ ధరను క్వింటాలుకు రూ. 2150గా నిర్ణయించారు. కాగా, యుఆర్ఎస్ అమ్మకపు ధర క్వింటాలుకు రూ. 2150.86 ఉండగా, దాని రిజర్వు ధరను క్వింటాలుకు రూ. 2125గా ఉంది.
అలాగే క్వింటాలు బియ్యానికి వెయిటెడ్ సగటు ధర దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు ధర క్వింటాలుకు రూ. 2952,27కి వ్యతిరేకంగా రూ. 2956.19గా ఉంది.
ప్రస్తుత విడత ఇ- వేలాలలో, చిల్లర ధరలను తగ్గించే లక్ష్యంతో గోధుమ కొనుగోలు దారుకు గరిష్టంగా 100 టన్నులను, బియ్యం 1000 టన్నులను అందిస్తున్నారు. చిన్న, సన్న తుది వినియోగదారులను ప్రోత్సహించడం, తాము ఎంపిక చేసుకున్న డిపో నుంచి నిర్దేశిత పరిమాణానికి వేలంలో పాలుపంచుకునేందుకు మరింత భాగస్వాములను పాల్గొనేలా చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆహార ధాన్యాల నిల్వలను పోగు చేయడాన్ని నివారించేందుకు వ్యాపారులను ఒఎంఎస్ఎస్ (డి) కింద గోధుమ అమ్మకం పరిధి ఆవల ఉంచడమే కాక, ఒఎంఎస్ఎస్ (డి) కింద కొనుగోలు చేసిన గోధుమలను ఆడించే పిండిమిల్లుల పై క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 05.09.2023 వరకు 898 తనిఖీలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1956450)
Visitor Counter : 136