గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జి20 నాయకుల సదస్సు కోసం భరతమండంలోని ట్రైబ్స్ ఇండియా పెవిలియన్‌లో క్రాఫ్ట్స్ బజార్‌లో విస్త్రత శ్రేణిలో గిరిజన కళలు, కళాఖండాల ప్రదర్శన
గుజరాత్, మధ్యప్రదేశ్ గిరిజనులు గౌరవించే పిథోరా కళ ప్రత్యక్ష ప్రదర్శన
Posted On:
08 SEP 2023 6:01PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED - భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య) ట్రైబ్స్ ఇండియా పెవిలియన్‌లో సంప్రదాయ గిరిజన కళలు, కళాఖండాలు, పెయింటింగ్‌లు, మృణ్మయ కళ (పాటరీ), వ్రస్తాలు, సేంద్రియ సహజ ఉత్పత్తులతో పాటుగా మరెన్నో వస్తువులను ప్రదర్శించనుంది. ఈ ప్రదర్శనను న్యూఢిల్లీలోని భారత మండపంలో జి-20 నాయకుల సదస్సులో భాగంగా, 9 & 10 సెప్టెంబర్ 2023లో క్రాఫ్ట్స్ బజార్ (హాల్ 3)లో నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో పిథోరా కళలో ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ పరేష్ రాథ్వా పాల్గొని గుజరాత్ & మధ్యప్రదేశ్‌కు చెందిన రాథ్వా, భిలాలా, నాయక్, భిల్ గిరిజన తెగలు ఆచారప్రకారం అనుసరించి, గౌరవించే, సుసంపన్నమైన కళలను, ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సమర్పించనున్నారు. ప్రాచీన కళ పట్ల ఈ ఉద్వేగభరితమైన వైఖరి మన సాంస్కృతిక ఉన్నతిని పునరుద్ధరించడమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉత్సుకతను సృష్టించింది.
మధ్య ప్రదేశ్ నుంచి గోండ్ పెయింటింగ్, ఒడిషా కళాకారుల సౌర పెయింటింగ్స్ నయనానందకరంగా, అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటుగా, ఎత్తైన ప్రదేశాలకు చెందిన లేహ్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బోధ్, భూటియా గిరిజనుల నేసే అంగోరా, పష్మీనా శాలువలను తప్పనిసరిగా చూడాల్సిందే, అలాగే, నాగాలాండ్‌కు చెందిన కోన్యాక్ గిరిజనులు తయారు చేసిన రంగురంగుల ఆభరణాలు కంటిని ఆకర్షిస్తాయి.
అలాగే మధ్య ప్రదేశ్ నుంచి వచ్చే కళకళలాడే మహేశ్వరీ చీరెలను మతపరమైన, శుభకార్యాలలో కట్టుకుంటారు. దీనికి అదనంగా, అస్సాంకు చెందిన బోడో గిరిజనులు సున్నితంగా నేసే ఎరి లేదా మిల్లీనియం సిల్క్ వ్రస్తాలు విలువకే కొత్త కోణాన్ని ఆపాదిస్తాయి.
కరిగించిన లోహాలు, పూసలు, రంగురంగుల గాజు ముక్కలు, చెక్క బంతులను కరిగించి చెక్కే ధోక్రా ఆభరణాలు ఆ జాతి విలక్షణతను, విలువను పట్టిచూపుతాయి. ఈ సంప్రదాయ ఆభరణాలు సహజ ఇతివృత్తాన్ని కలిగి, అధునాతనంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే గిరిజన చేతివృత్తి కళాకారులు ఈ సహజసిద్ధ కళాఖండాల శిల్పులు.
రాజస్థాన్‌లోని మీనా తెగకు చెందిన గిరిజన హస్తకళాకారులు లోహ అంబాబారీ కళా నైపుణ్యం ఎంతో సున్నితంగా, అందంగా, నాజూకుగా కనిపిస్తాయి. ఈ ఉత్పత్తులు రంగుల లేదా అలంకరణ కళ అయిన ఎనామెలింగ్‌ను (పింగాణి పూత) ఉపయోగించి ఆభరణపు లోహ ఉపరితలంపై పువ్వులు, పక్షులు తదితర సున్నిత డిజైన్లను జోడించి అలంకరిస్తారు. ఇటువంటి హస్తకళలను అలంకరించే గృహాలకు విలక్షణమైన సాంప్రదాయ సౌందర్యం, ప్రశాంతతను ఇస్తాయి.
సహజ ఉత్పత్తులు అయిన అరకు లోయ కాఫీ, తేనె, జీడిపప్పు, బియ్యం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన సుగంధ ద్రవ్యాల వంటివి ట్రైఫెడ్ ప్రదర్శిస్తున్న అనేకానేక ఉత్పత్తులలో కొన్ని మాత్రమే.
వీటన్నిటితో పాటుగా, దేశ వారసత్వ సంపదను ఒకే కప్పు కింద కు తీసుకువస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్నివర్ణించే, సాంస్కృతిక, సంప్రదాయ చిత్రాల దృశ్యరూపకల్పనను ట్రైబ్స్ ఇండియా పెవిలియన్‌లో ప్రదర్శిస్తున్నారు.
ప్రదర్శనకు సంబంధించిన కొన్ని ఫోటోలు దిగువన ఇవ్వడం జరిగిందిః
***
(Release ID: 1955667)
Visitor Counter : 182