ప్రధాన మంత్రి కార్యాలయం
జకార్తా పర్యటన సందర్భంగా ప్రధాని వీడ్కోలు ప్రకటన
Posted On:
06 SEP 2023 6:29PM by PIB Hyderabad
ఆసియాన్ సంబంధిత సమావేశాల్లో పాల్గొనడం కోసం గౌరవనీయ జోకో విడోడో ఆహ్వానం మేరకు నేను ఇండోనేషియా రాజధాని జకార్తా పర్యటనకు బయల్దేరుతున్నాను. ఈ పర్యటనలో భాగంగా 20వ ఆసియాన్-భారత శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నా తొలి కార్యక్రమం. ఈ సందర్భంగా ఆసియాన్ కూటమి దేశాల అధినేతలతో సంభాషణల్లో పాల్గొనబోతున్నాను. ఆసియాన్-భారత సంబంధాలు నాలుగో దశాబ్దంలో ప్రవేశించిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం భవిష్యత్ పరిణామాలపై మా మధ్య ప్రధానంగా చర్చ సాగుతుంది.
భారత్ అనుసరిస్తున్న “తూర్పు కార్యాచరణ” విధానం మూలస్తంభాల్లో ఆసియాన్ కూటమితో సంబంధాలు కూడా ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కుదుర్చుకున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం స్నేహ సంబంధాలకు నూతనోత్తేజం ఇచ్చింది.
నా పర్యటనలో రెండో కార్యక్రమం కింద 18వ ఆసియా శిఖరాగ్ర సదస్సులోనూ పాల్గొంటాను. ఆహార-ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం. డిజిటల్ పరివర్తనసహా కీలక ప్రాంతీయ అంశాలపై చర్చలకు ఈ వేదిక ఎంతో ఉపయుక్తం. ఈ ప్రపంచ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకార చర్యలపై తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో అభిప్రాయాల మార్పిడికి నేను సిద్ధంగా ఉన్నాను.
గత సంవత్సరం బాలిలో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా సందర్శించిన నాటి ఉల్లాసపూరిత జ్ఞాపకాలను నేనిప్పుడు మననం చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ప్రస్తుత పర్యటన ఆసియాన్ దేశాలతో మన స్నేహ సంబంధాలను మరింత విస్తృతం చేయగలదని నా దృఢ విశ్వాసం.
***
(Release ID: 1955386)
Visitor Counter : 120
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam