సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

పురావస్తు పరిశోధన సంస్థ(ఏఎస్ఐ) అమలు చేయనున్న “అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్”, ఇండియన్ హెరిటేజ్ యాప్, ఇ-పర్మిషన్ పోర్టల్ ప్రారంభం


'వారసత్వంతో అభివృద్ధి' విధానాలకు అనుగుణంగా సుసంపన్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పునరుజ్జీవన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు సాంస్కృతిక సంస్థలు సహకారం అందించాలి.... కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి

దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి జీ-20 అధ్యక్ష పదవి ఒక మంచి అవకాశం.. శ్రీమతి మీనాక్షి లేఖి

Posted On: 04 SEP 2023 6:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 3696 స్మారక చిహ్నాలు పురావస్తు పరిశోధన సంస్థ(ఏఎస్ఐ) రక్షణలో ఉన్నాయి. ఈ స్మారక కట్టడాలు భారతదేశ  గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడానికి  వారసత్వ .ప్రదేశాలకు ఎప్పటికప్పుడు సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉంటుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించి సందర్శకులకు మరింత అనుభవాన్ని అందించడానికి  “అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్”ను  పురావస్తు పరిశోధన సంస్థ(ఏఎస్ఐ) రూపొందించింది. . పథకాన్ని 2023 సెప్టెంబర్ 4న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంవెట్ ఆడిటోరియంలో “అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0” కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక ,ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ  శ్రీ జి కిషన్ రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ కిషన్ రెడ్డి  'వారసత్వంతో  అభివృద్ధి' విధానాలకు అనుగుణంగా సుసంపన్న  సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పునరుజ్జీవన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు సాంస్కృతిక సంస్థలు సహకారం అందించాలని కోరారు. 

కార్పొరేట్ సంస్థల సహకారంతో  'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం అమలు జరుగుతుందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా  ఈ స్మారక చిహ్నాలను తరువాతి తరాల కోసం రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగస్వాములు కావడానికి కార్పొరేట్ సంస్థలకు  అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. 

 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం కింద కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధులతో స్మారక చిహ్నాల వద్ద సౌకర్యాలు మెరుగుపరచడానికి పురావస్తు పరిశోధన సంస్థ అనుమతి ఇస్తుంది. 2017 లో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం అమలులో AMASR చట్టం 1958 నిబంధనల ప్రకారం    పురావస్తు పరిశోధన సంస్థ సవరణలు చేసింది. మార్పులు చేసిన పథకం కింద వివిధ స్మారక చిహ్నాల వద్ద కల్పించవలసిన సౌకర్యాలను పురావస్తు పరిశోధన సంస్థ  గుర్తిస్తుంది. URL www.indianheritage.gov.in తో అంకితమైన వెబ్ పోర్టల్ ద్వారా స్మారక చిహ్నం వద్ద స్మారక చిహ్నం లేదా నిర్దిష్ట సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి  దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన సౌకర్యాలు,  సౌకర్యాల కల్పనకు అయ్యే ఖర్చు తదితర వివరాలు, దత్తత కోసం అందుబాటులో ఉన్నస్మారక చిహ్నాల వివరాలను కలిగి ఉంటుంది. కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి  మీనాక్షీ లేఖి, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ కేకే బాసా తదితరులు పాల్గొన్నారు

గుర్తింపు సాధనలో సాంస్కృతిక వారసత్వం ప్రాముఖ్యతను  శ్రీమతి  మీనాక్షీ లేఖి వివరించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి   జీ-20 అధ్యక్ష పదవి ఒక మంచి అవకాశం అని  శ్రీమతి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. ప్రతి స్మారక చిహ్నం వద్ద ఆర్థిక, అభివృద్ధి అవకాశాలు అంచనా వేసి సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత    ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని  ఆమె చెప్పారు.

" 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం కార్పొరేట్ సంస్థల  సహకారాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది, దీని ద్వారా  రాబోయే తరాలకు ఈ స్మారక చిహ్నాలను సంరక్షించడంలో కార్పొరేట్ సంస్థలు సహాయం అందిస్తాయి ” అని మంత్రి చెప్పారు. ప్రతి స్మారక చిహ్నం వద్ద ఆర్థిక, అభివృద్ధి అవకాశాలు అంచనా వేసి సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

నిర్వహణ కోసం ఎంపిక అయిన సంస్థ  పరిశుభ్రత, ప్రాప్యత, భద్రత, విజ్ఞాన వర్గాలలో సౌకర్యాలు అభివృద్ధి చేసి నిర్వహిస్తుంది.  అలా చేయడం ద్వారా సంస్థ  బాధ్యతాయుతమైన,వారసత్వ-స్నేహపూర్వక సంస్థగా గుర్తింపు పొందుతుంది. తొలుత నిర్వహణ బాధ్యత 5 సంవత్సరాల వరకు అప్పగిస్తారు. దీనిని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.

 'ఇండియన్ హెరిటేజ్' పేరుతో ఒక యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ ను కూడా పురావస్తు పరిశోధన సంస్థ ప్రారంభించింది. భారతదేశ వారసత్వ స్మారక చిహ్నాలను ప్రదర్శిస్తుంది. యాప్‌లో రాష్ట్రాల వారీగా స్మారక చిహ్నాల వివరాలు, ఫోటోగ్రాఫ్‌లు, అందుబాటులో ఉన్న  సౌకర్యాల జాబితా, జియో-ట్యాగ్ చేయబడిన స్థానం, పౌరులకు ఫీడ్‌బ్యాక్ మెకానిజం వంటివి ఉంటాయి.  దశలవారీగా కార్యక్రమాన్ని అమలు చేస్తారు.   టిక్కెట్టు పొందిన స్మారక చిహ్నాలు మొదటి దశలో యాప్ లో అందుబాటులో ఉంటాయి. తరువాత మిగిలిన స్మారక చిహ్నాలు యాప్ లో లభిస్తాయి. . స్మారక చిహ్నాల ఫోటోగ్రఫీ, చిత్రీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అనుమతి పొందడం కోసం www.asipermissionportal.gov.in  ఇ-పర్మిషన్ పోర్టల్ కూడా ప్రారంభమైంది. పోర్టల్ వివిధ అనుమతులను పొందడం కోసం ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తుంది. 

www.indianheritage.gov.in

www.asipermissionportal.gov.in

 

***(Release ID: 1955009) Visitor Counter : 144


Read this release in: Urdu , English , Hindi , Marathi