గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

7 నాన్-ఫెర్రస్ రిఫైన్డ్ మెటల్ ఉత్పత్తుల కోసం 3 నాణ్యత నియంత్రణ ఆర్డర్‌ల నోటిఫికేషన్‌ను కేంద్రం ప్రకటించింది


అల్యూమినియం, కాపర్ మరియు నికెల్ లోహాల కోసం క్యూ సి ఓ లను వెలువరించడం ద్వారా బీ ఐ ఎస్ నిర్బంధ ధృవీకరణపై గనుల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. నాణ్యత నియంత్రణ పర్యావరణ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ప్రయోజనం మరియు పరిశ్రమ పోటీతత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

తక్కువ నాణ్యత ప్రమాణాల ఉత్పత్తుల దిగుమతులను అరికట్టడానికి, అక్రమమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి మరియు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది.

Posted On: 01 SEP 2023 3:00PM by PIB Hyderabad

గనుల మంత్రిత్వ శాఖ 2023 ఆగస్టు 31న టెక్నికల్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ ప్రక్రియను అనుసరించి ఏడు అంశాలపై మూడు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లను (క్యూ సి ఓలు) నోటిఫై చేసింది. ఈ క్యూ సి ఓలు నోటిఫికేషన్ తేదీ నుండి మూడు నెలల నుండి అమలులోకి వస్తాయి. ఈ క్యూ సి ఓలు బీ ఐ ఎస్ చట్టం కింద గనుల మంత్రిత్వ శాఖ వెలువరించిన మొదటి సాంకేతిక నిబంధనలను సూచిస్తాయి.

 

అల్యూమినియం మరియు అల్యూమినియం మిశ్రమాల కోసం క్యూ సి ఓ దేశీయ ఉత్పత్తి మరియు అల్యూమినియం మరియు అల్యూమినియం మిశ్రమం (కడ్డీలు మరియు కాస్టింగ్) అధిక స్వచ్ఛత ప్రాథమిక అల్యూమినియం కడ్డీ; బేరింగ్లు కోసం అల్యూమినియం మిశ్రమం కడ్డీలు; రీమెల్టింగ్ కోసం ప్రాథమిక అల్యూమినియం కడ్డీలు; మరియు అల్యూమినియం కడ్డీలు, బిల్లేట్లు మరియు వైర్ బార్లు (ఈ సీ గ్రేడ్) కోసం తగిన భారతీయ ప్రమాణాల  ప్రకారం నిర్బంధ ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది. మిగిలిన రెండు క్యూ సి ఓలు రాగి మరియు నికెల్ పౌడర్ కోసం తగిన  ప్రమాణాలను అందిస్తాయి.

 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీ ఐ ఎస్) సంబంధిత పరిశ్రమల సంఘాలు మరియు వాటాదారులతో సంప్రదింపులతో కూడిన విస్తృతమైన ప్రక్రియ తర్వాత మూడు క్యూ సి ఓలను ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ వెబ్‌సైట్‌లో సభ్య దేశాల నుండి వ్యాఖ్యలను ఆహ్వానించడానికి 60 రోజుల వ్యవధి తో  డ్రాఫ్ట్ క్యూ సి ఓలను హోస్ట్ చేశారు మరియు  వాటాదారుల నుండి వ్యాఖ్యల కోసం 60 రోజుల వ్యవధి తో మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో హోస్ట్ చేశారు. కేంద్ర గనుల మంత్రి ఆమోదం పొందిన తర్వాత మరియు శాసన శాఖ ద్వారా పరిశీలన తర్వాత క్యూ సి ఓలను ఖరారు చేయడం జరిగింది.

 

గనుల మంత్రిత్వ శాఖ దేశంలో నాన్-ఫెర్రస్ లోహాల రంగానికి నాణ్యత నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. దాని కోసం, నాన్-ఫెర్రస్ మెటల్ విలువ గొలుసులోని అప్‌స్ట్రీమ్ ఉత్పత్తులపై (రిఫైన్డ్ మెటల్) మరిన్ని క్యూ సి ఓల కోసం మంత్రిత్వ శాఖ బీ ఐ ఎస్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

 

తప్పనిసరి క్యూ సి ఓల అభివృద్ధి తక్కువ నాణ్యత ప్రమాణాల ఉత్పత్తుల దిగుమతులను అరికట్టడానికి, అక్రమమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి మరియు పారిశ్రామిక వినియోగదారులతో సహా దేశీయ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాను నిర్ధారించడంలో సహాయపడుతుంది. నోటిఫైడ్ క్యూ సి ఓ లు వినియోగదారు పరిశ్రమ ప్రయోజనాల కోసం అల్యూమినియం మెటల్ మరియు మిశ్రమాలు, రాగి మరియు నికెల్ యొక్క ప్రమాణం మరియు నాణ్యతను నిర్ధారిస్తాయి. అదే సమయంలో, క్యూ సి ఓలు ఈ ఉత్పత్తులలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో 'మేక్ ఇన్ ఇండియా' బ్రాండ్ విలువను పెంచుతాయి. ప్ర‌ధాన మంత్రి ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ దృక్ప‌థాన్ని సాకారం చేయ‌డానికి ఉద్దేశించిన  అనేక కార్య‌క్ర‌మాల‌లో గ‌నుల మంత్రిత్వ శాఖ యొక్క క్యూ సి ఓలు నోటిఫికేషన్‌లు ఉన్నాయి.

 

***


(Release ID: 1954322)