సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 కార్యక్రమం, ఇండియన్ హెరిటేజ్ ఆప్, ఇ- పర్మిషన్ పోర్టల్‌ను 4 సెప్టెంబర్ 2023న ప్రారంభించనున్న ఎఎస్ఐ
Posted On:
31 AUG 2023 6:40PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 3696 పురావస్తు కట్టడాలు, స్మారక చిహ్నాలు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సంరక్షణలో ఉన్నాయి. ఈ పురావస్తు కట్టడాలు గల ప్రదేశాలు, వస్తువులు భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడమే కాక ఆర్ధిక వృద్ధిని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.ఈ సుంసపన్నమైన సాంస్కృతవారసత్వాన్ని నిలబెట్టేందుకు, వారసత్వ కట్టడాలు, స్థలాలకు ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరిచడం అవసరం.
ఈ క్రమంలో, సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎఎస్ఐ 4 సెప్టెంబర్ 2023న న్యూఢిల్లీలోని ఐజిఎన్‌సిఎలోని సంవేత్ ఆడిటోరియంలో అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 (ఒక వారసత్వ కట్టడాన్ని దత్తత తీసుకోండి) కార్యక్రమాన్ని ఎఎస్ఐ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద, ఈ ప్రదేశాలలో తమ సిఎస్ఆర్ నిధులను వినియోగించి సౌకర్యాలను మెరుగుపరచవలసిందిగా కార్పొరేట్ భాగస్వాములను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమంలో 2017లో ప్రారంభించిన ఇంతకు ముందు పథకపు మెరుగుపరిచిన వర్షన్. ఇందులో ఎఎంఎఎస్ఆర్ చట్టం, 1958 ప్రకారం భిన్న వారసత్వ స్థలాల కోసం అవసరమైన సౌకర్యాలను స్పష్టంగా నిర్వచించారు. భాగస్వాములు ఒక వారసత్వ స్థలాలను లేదా ఒక వారసత్వ స్థలం వద్ద నిర్ధిష్ట సౌకర్యం/ సౌకర్యాలను అందుకోసం ఉద్దేశించిన www.indianheritage.gov.in అన్న యుఆర్ఎల్ కలిగిన వెబ్‌పోర్టల్ ద్వారా అందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అంతరాల విశ్లేషణ, సౌకర్యాల కోసం ఆర్ధిక అంచనాలతో దత్తత తీసుకోమని కోరుతున్న స్మారకచిహ్నాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
మన అస్తిత్వాన్ని మలచడంలో సాంస్కృతిక వారసత్వపు ప్రాముఖ్యత గురించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, డిఒఎన్ఇఆర్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడారు. మన వారసత్వ చిహ్నాలు కేవలం నిర్మాణాలు కావు, అవి మన చరిత్ర, కళ, వాస్తు శిల్పానికి సజీవ సాక్ష్యాలు. అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 కార్యక్రమం కార్పొరేట్ భాగస్వాముల భాగస్వామ్యాన్ని పెంపొందించుకొని తద్వారా వారు ఈ వారసత్వ చిహ్నాలను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించేందుకు దోహదం చేసేలా యత్నిస్తుందని మంత్రి అన్నారు. ప్రతి స్మారక చిహ్నం వద్ద ఆర్ధికపరమైన, అభివృద్ధి అవకాశాలను అంచనా వేయడం, వివిధ వాటాదారులతో చర్చలను నిర్వహించి, అనంతరం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
ఎంపిక చేసిన వాటాదారులు పరిశుభ్రత, ప్రాప్యత, భద్రత, విజ్ఞాన వర్గాలలో సౌకర్యాలను అభివృద్ధి చేసి అందించడం లేదా నిర్వహించడం చేస్తారు. అలా చేయడం ద్వారా, వారు బాధ్యత కలిగిన, వారసత్వ అనుకూల సంస్థగా గుర్తింపును పొందే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ నియామకం తొలుత ఐదేళ్ళ కాల పరిమితితో ఉంటుంది, దీనిని మరొక ఐదేళ్ళ వరకు కొనసాగించవచ్చు.
అదనంగా, ఇండియన్ హెరిటేజ్ పేరిట వినియోగదారుల అనుకూల మోబైల్ ఆప్‌ను అదే రోజును ప్రారంభిస్తారు. ఇది భారతదేశంలోని వారసత్వ స్థలాలను, చిహ్నాలను ప్రదర్శిస్తుంది. ఈ యాప్ రాష్ట్రాలవారీగా ఉన్న వారసత్వ ప్రదేశాల జాబితా, వాటి ఫోటోగ్రాఫ్‌లు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, జియో-ట్యాగ్ చేసిన ప్రదేశాల వివరాలతో పాటు, పౌరులు తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఏర్పాటును కలిగి ఉంటుంది. కాగా, , టికెట్ కలిగిన వారసత్వ ప్రదేశాలు మొదటి దశలో, అనంతరం మిగిలిన వారసత్వ ప్రదేశాల ప్రారంభం అనంతరం చేయడం ద్వారా వీటి ప్రారంభం దశలవారీగా ఉంటుంది. ఫోటోగ్రఫీ, చిత్రీకరణ, వారసత్వ స్థలాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతులు పొందేందుకు www.asipermissionportal.gov.in అన్న యుఆర్ఎల్ కలిగిన ఇ- పర్మిషన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించనున్నారు. వివిధ అనుమతులు పొందే ప్రక్రియను వేగంగా ట్రాక్ చేయడమే కాక ఇందులో గల కార్యాచరణ, లాజిస్టిక్ ఆటంకాలను ఈ పోర్టల్ పరిష్కరిస్తుంది.
****
(Release ID: 1953927)
Visitor Counter : 199