వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 జులైతో పోలిస్తే 2023 జులైలో 8.0% (తాత్కాలికం) పెరిగిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉమ్మడి సూచిక


2023 జులై నెలకు సంబంధించిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక (ఆధారం: 2011-12=100)

Posted On: 31 AUG 2023 5:00PM by PIB Hyderabad

దేశంలోని ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉమ్మడి సూచిక (ఐసీఐ), 2022 జులైతో పోలిస్తే 2023 జులైలో 8.0% (తాత్కాలికం) పెరిగింది. ప్రధాన పరిశ్రమలైన బొగ్గు, ఉక్కు, సహజ వాయువు, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ముడి చమురు రంగాల ఉత్పత్తి గత సంవత్సరం జులైతో పోలిస్తే ఈ సంవత్సరం జులైలో వృద్ధి చెందింది. వార్షిక, నెలవారీ సూచికలు, వృద్ధి రేట్ల వివరాలు అనుబంధం I & IIలో ఉన్నాయి.

బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల ఉత్పత్తిలో ఉమ్మడి & వ్యక్తిగత పనితీరును ఐసీఐ సూచిస్తుంది. ఈ ఎనిమిది ప్రధాన పరిశ్రమలకు కలిపి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో (ఐఐపీ) 40.27 శాతం వెయిటేజీ ఉంది.

2023 ఏప్రిల్‌ నెలకు సంబంధించి, ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక తుది వృద్ధి రేటు దాని తాత్కాలిక స్థాయి 3.5 శాతం నుంచి 4.6 శాతానికి సవరించారు. 2023-24 ఏప్రిల్ నుంచి జులై వరకు ఐసీఐ మొత్తం వృద్ధి రేటు గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 6.4 శాతంగా (తాత్కాలికం) ఉంది.

ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక సారాంశం ఇది:

బొగ్గు - బొగ్గు ఉత్పత్తి (వెయిటేజీ: 10.33 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 14.9 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 10.1 శాతం పెరిగింది.

ముడి చమురు - ముడి చమురు ఉత్పత్తి (వెయిటేజీ: 8.98 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 2.1 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 1.0 శాతం క్షీణించింది.

సహజ వాయువు - సహజ వాయువు ఉత్పత్తి (వెయిటేజీ: 6.88 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 8.9 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 2.3 శాతం పెరిగింది.

పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు - పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి (వెయిటేజీ: 28.04 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 3.6 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 2.3 శాతం పెరిగింది.

ఎరువులు - ఎరువుల ఉత్పత్తి (వెయిటేజీ: 2.63 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 3.3 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 9.1 శాతం పెరిగింది.

ఉక్కు - ఉక్కు ఉత్పత్తి (వెయిటేజీ: 17.92 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 13.5 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 15.3 శాతం పెరిగింది.

సిమెంట్ - సిమెంట్ ఉత్పత్తి (వెయిటేజీ: 5.37 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 7.1 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 11.2 శాతం పెరిగింది.

విద్యుత్ - విద్యుత్ ఉత్పత్తి (వెయిటేజీ: 19.85 శాతం) 2022 జులై కంటే 2023 జులైలో 6.9 శాతం పెరిగింది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే, 2023-24 ఏప్రిల్-జులై కాలంలో దీని మొత్తం సూచిక 2.7 శాతం పెరిగింది.

 

గమనిక 1: 2023 మే, జూన్, జులైకి సంబంధించిన సమాచారం తాత్కాలికమైనది. మూలాధార సంస్థల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ప్రధాన పరిశ్రమల సూచిక సంఖ్యలు సవరించడం/ఖరారు చేయడం జరిగింది.

గమనిక 2: 2014 ఏప్రిల్ నుంచి, పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి సమాచారం కూడా చేర్చడం జరిగింది.

గమనిక 3: పైన సూచించిన పరిశ్రమల వారీ వెయిటేజీలు ఐఐపీ నుంచి తీసుకున్న వ్యక్తిగత పరిశ్రమ వెయిటేజీలు & 100కి సమానంగా ఉండే ఐసీఐ ఉమ్మడి వెయిటేజీకి ప్రో-రేటా ప్రాతిపదికన పెంచడం జరుగుతుంది.

గమనిక 4: 2019 మార్చి నుంచి, పూర్తయిన ఉక్కు ఉత్పత్తిలో ‘కోల్డ్ రోల్డ్ (సీఆర్‌) కాయిల్స్’ అంశం కింద 'హాట్ రోల్డ్ పికిల్డ్‌ అండ్ ఆయిల్డ్' (హెచ్‌ఆర్‌పీవో) అనే కొత్త ఉక్కు ఉత్పత్తిని కూడా చేర్చారు.

గమనిక 5: 2023 ఆగస్టుకు సంబంధించిన సూచికను 29 సెప్టెంబర్ 2023, శుక్రవారం నాడు విడుదల చేయడం జరుగుతుంది.

 

అనుబంధం I

ఎనిమిది ప్రధాన పరిశ్రమల పనితీరు

వార్షిక సూచిక & వృద్ధి రేటు

ఆధార సంవత్సరం: 2011-12=100

సూచిక

రంగం  

బొగ్గు  

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు  

ఉక్కు    

సిమెంట్  

విద్యుత్  

మొత్తం సూచిక

వెయిటేజీ

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

103.2

99.4

85.6

107.2

96.7

107.9

107.5

104.0

103.8

2013-14

104.2

99.2

74.5

108.6

98.1

115.8

111.5

110.3

106.5

2014-15

112.6

98.4

70.5

108.8

99.4

121.7

118.1

126.6

111.7

2015-16

118.0

97.0

67.2

114.1

106.4

120.2

123.5

133.8

115.1

2016-17

121.8

94.5

66.5

119.7

106.6

133.1

122.0

141.6

120.5

2017-18

124.9

93.7

68.4

125.2

106.6

140.5

129.7

149.2

125.7

2018-19

134.1

89.8

69.0

129.1

107.0

147.7

147.0

156.9

131.2

2019-20

133.6

84.5

65.1

129.4

109.8

152.6

145.7

158.4

131.6

2020-21

131.1

80.1

59.8

114.9

111.6

139.4

130.0

157.6

123.2

  2021-22

142.3

77.9

71.3

125.1

112.4

163.0

156.9

170.1

136.1

  2022-23

163.5

76.6

72.4

131.2

125.1

178.1

170.6

185.2

146.7

ఏప్రిల్-జులై 2022-23

146.2

78.1

72.0

133.0

119.0

165.3

167.3

195.1

144.8

ఏప్రిల్-జులై 2023-24*

161.0

77.3

73.7

136.1

129.9

190.6

186.0

200.3

154.1

 *తాత్కాలికం

 

వృద్ధి రేట్లు (వైవోవై ప్రాతిపదికన శాతంలో)

రంగం  

బొగ్గు  

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు

ఉక్కు

సిమెంట్

విద్యుత్

మొత్తం వృద్ధి

వెయిటేజీ

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

3.2

-0.6

-14.4

7.2

-3.3

7.9

7.5

4.0

3.8

2013-14

1.0

-0.2

-12.9

1.4

1.5

7.3

3.7

6.1

2.6

2014-15

8.0

-0.9

-5.3

0.2

1.3

5.1

5.9

14.8

4.9

2015-16

4.8

-1.4

-4.7

4.9

7.0

-1.3

4.6

5.7

3.0

2016-17

3.2

-2.5

-1.0

4.9

0.2

10.7

-1.2

5.8

4.8

2017-18

2.6

-0.9

2.9

4.6

0.03

5.6

6.3

5.3

4.3

2018-19

7.4

-4.1

0.8

3.1

0.3

5.1

13.3

5.2

4.4

2019-20

-0.4

-5.9

-5.6

0.2

2.7

3.4

-0.9

0.9

0.4

2020-21

-1.9

-5.2

-8.2

-11.2

1.7

-8.7

-10.8

-0.5

-6.4

2021-22

8.5

-2.6

19.2

8.9

0.7

16.9

20.8

8.0

10.4

2022-23

14.8

-1.7

1.6

4.8

11.3

9.3

8.7

8.9

7.8

ఏప్రిల్-జులై 2022-23

26.6

-0.5

3.5

11.7

11.3

7.0

12.9

13.1

11.5

ఏప్రిల్-జులై 2023-24*

10.1

-1.0

2.3

2.3

9.1

15.3

11.2

2.7

6.4

* తాత్కాలికం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తూ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వైవోవైని లెక్కిస్తారు.

 

అనుబంధం II

ఎనిమిది ప్రధాన పరిశ్రమల పనితీరు

నెలవారీ సూచిక & వృద్ధి రేటు
ఆధార సంవత్సరం: 2011-12=100

సూచిక

రంగం  

బొగ్గు  

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు  

ఉక్కు    

సిమెంట్  

విద్యుత్  

మొత్తం సూచిక

వెయిటేజీ

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

జులై-22

132.7

77.3

72.6

129.8

127.6

166.8

155.4

188.9

141.1

ఆగస్టు-22

127.5

76.7

73.0

123.6

130.9

170.5

152.0

191.3

139.9

సెప్టెంబర్‌-22

127.5

75.2

72.1

120.2

127.0

172.8

158.7

187.4

138.6

అక్టోబర్‌-22

145.8

77.4

73.0

123.5

129.5

177.3

155.2

169.3

138.8

నవంబర్‌-22

167.5

75.8

71.8

119.7

129.2

175.5

164.3

166.7

139.4

డిసెంబర్‌-22

184.4

78.2

74.5

139.3

129.9

190.9

184.8

179.4

153.4

జనవరి-23

198.6

78.3

75.2

142.0

135.8

199.5

184.7

186.6

158.8

ఫిబ్రవరి-23

190.1

68.1

67.0

129.1

125.2

185.4

180.2

174.0

147.3

మార్చి-23

235.5

77.3

74.6

144.7

118.1

204.4

198.4

188.0

164.7

ఏప్రిల్‌-23

161.2

75.0

68.9

132.7

118.7

191.2

192.0

192.3

151.2

మే-23*

167.6

78.8

73.3

141.1

138.2

190.7

190.8

201.6

157.1

జూన్‌-23*

162.4

76.4

73.4

136.2

130.8

191.2

195.0

205.2

155.8

జులై-23*

152.6

78.9

79.0

134.4

131.8

189.4

166.3

202.0

152.4

     *తాత్కాలికం

 

వృద్ధి రేట్లు (వైవోవై ప్రాతిపదికన శాతంలో)

రంగం  

బొగ్గు  

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు  

ఉక్కు    

సిమెంట్  

విద్యుత్  

మొత్తం వృద్ధి

వెయిటేజీ

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

జులై-22

11.4

-3.8

-0.3

6.2

6.2

7.5

0.7

2.3

4.8

ఆగస్టు-22

7.7

-3.3

-0.9

7.0

11.9

5.8

2.1

1.4

4.2

సెప్టెంబర్‌-22

12.1

-2.3

-1.7

6.6

11.8

7.7

12.4

11.6

8.3

అక్టోబర్‌-22

3.8

-2.2

-4.2

-3.1

5.4

5.8

-4.2

1.2

0.7

నవంబర్‌-22

12.3

-1.1

-0.7

-9.3

6.4

11.5

29.1

12.7

5.7

డిసెంబర్‌-22

12.3

-1.2

2.6

3.7

7.3

12.3

9.5

10.4

8.3

జనవరి-23

13.6

-1.1

5.2

4.5

17.9

14.3

4.7

12.7

9.7

ఫిబ్రవరి-23

9.0

-4.9

3.1

3.3

22.2

12.4

7.4

8.2

7.4

మార్చి-23

11.7

-2.8

2.7

1.5

9.7

12.1

-0.2

-1.6

4.2

ఏప్రిల్‌-23

9.1

-3.5

-2.9

-1.5

23.5

16.6

12.4

-1.1

4.6

మే-23*

7.2

-1.9

-0.3

2.8

9.7

10.9

15.3

0.8

5.0

జూన్‌-23*

9.8

-0.6

3.5

4.6

3.4

20.8

9.9

4.2

8.3

జులై-23*

14.9

2.1

8.9

3.6

3.3

13.5

7.1

6.9

8.0

    * తాత్కాలికం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తూ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వైవోవైని లెక్కిస్తారు.

                                             

****


(Release ID: 1953898) Visitor Counter : 149