రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ర‌హ‌దారి 301 కార్గిల్‌- జాన్‌స్క‌ర్ ఇంట‌ర్మీడియేట్ లేన్‌ను ఆధునీక‌రిస్తున్న‌ట్టు తెలిపిన శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 31 AUG 2023 1:24PM by PIB Hyderabad

ల‌డాఖ్‌లో జాతీయ హైవే 301 పై గ‌ల కార్గిల్ - జానస్క‌ర్ ఇంట‌ర్మీడియ‌ట్ లేన్ ను ఆధునీక‌రిస్తున్నట్టు కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. 


ఈ ప్రాజ‌క్టు మొత్తం 31.14 కిలోమీట‌ర్ల పొడ‌వు ఉంటుంద‌ని, ప్యాకేజీ-6 కింద‌కు వ‌స్తుంద‌ని  శ్రీ గ‌డ్క‌రీ ఒక ట్వీట్‌లో తెలిపారు. అంత‌ర్గ‌తంగా ఉన్న జోన్ల‌లో అటు ప్ర‌యాణీకుల‌కు, ఇటు వ‌స్తువుల ర‌వాణాకు అందుబాటులో ఉండే, విశ్వ‌స‌నీయ లంకెను అందించ‌డం ద్వారా ఈ ప్రాంతంలో ఆర్ధిక వృద్ధ‌ని ప్రోత్స‌హించ‌డం ఈ కృషి ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. 

 


ఆధునీక‌రించిన హైవే ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటూ, ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు, స్థానిక ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు విశేషంగా దోహ‌దం చేస్తుంద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.  


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టును ల‌డాఖ్ ప్రాంతంలో వేగ‌వంత‌మైన‌, ఆటంకాలు లేని, ప‌ర్యావ‌ర‌ణ స్పృహ‌తో కూడిన చ‌ల‌న‌శీల‌త‌కు అంకితం చేస్తున్న‌ట్టు ఆయ‌న అన్నారు. 

***
 


(Release ID: 1953779) Visitor Counter : 136