సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
3 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రయోజనం కలిగిస్తూ గత 9 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ టూల్ రూమ్, శిక్షణా కేంద్రాలు ద్వారా 16 లక్షల మంది యువతకు శిక్షణ.. శ్రీ నారాయణ్ రాణే
Posted On:
30 AUG 2023 7:16PM by PIB Hyderabad
3 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రయోజనం కలిగిస్తూ గత 9 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ టూల్ రూమ్, శిక్షణా కేంద్రాలు ద్వారా 16 లక్షల మంది యువతకు శిక్షణ అందించామని
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే తెలిపారు. 'జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం' సందర్భంగా శ్రీ నారాయణ్ రాణే ట్విట్టర్‌లో సందేశం ఇచ్చారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 18 టూల్ రూమ్, శిక్షణా కేంద్రాలు 16 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చాయని మంత్రి తెలిపారు.శిక్షణ పొందిన యువత వల్ల గత 9 సంవత్సరాల కాలంలో 3 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రయోజనం కలిగిందని మంత్రి వివరించారు.
భారతదేశం అన్ని రంగాలలో స్వావలంబన సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాల సాధన కోసం ఎంఎస్ఎంఈ టూల్ రూమ్, శిక్షణా కేంద్రాలు కృషి చేస్తున్నాయని శ్రీ రాణే అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జరుగుతున్న పరిశ్రమలకు శిక్షణ పొందిన మానవ వనరులు అందించేందుకు టూల్ రూమ్‌లు సాంకేతిక కేంద్రాలు దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు.
క్రీడా వస్తువులు, ప్లాస్టిక్, ఆటోమొబైల్, పాదరక్షలు, గాజు, పెర్ఫ్యూమ్, ఫౌండ్రీ , ఫోర్జింగ్, ఎలక్ట్రానిక్స్, అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిశ్రమల్లో ఈ టూల్ రూమ్‌లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మధ్య చిన్న-పరిమాణ పరికరాలను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయని శ్రీ రాణే చెప్పారు. ఇటీవల జరిగిన చంద్రయాన్-3 మిషన్‌లో భువనేశ్వర్ టూల్ రూమ్ 437 రకాల 54,000 ఏరో-స్పేస్ భాగాలను ఉపయోగించారు. కరోనా మహమ్మారి సమయంలో పిపిఇ కిట్‌లు, శానిటైజర్ మెషీన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దేశీయ అవసరాలు తీర్చడానికి, విదేశాలకు ఎగుమతి చేయడంలో టూల్ రూమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
దేశంలో ఎంఎస్ఎంఈ యూనిట్లను మరింత బలోపేతం చేసేందుకు మరో 15 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఎస్ఎంఈ మంత్రి తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
***
(Release ID: 1953644)
Visitor Counter : 140