ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్  సందర్భం లోఅందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 30 AUG 2023 10:48AM by PIB Hyderabad

రక్షా బంధన్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరి జీవనం లో స్నేహ భావన ను మరియు సద్భావన ను ఈ పండుగ విస్తరింప జేయు గాక అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అభిలషించారు.

సామాజిక మాధ్యం ‘X’ లో ప్రధాన మంత్రి ఒక ట్వీట్ ను పోస్ట్ చేస్తూ, అందులో -

‘‘నా కుటుంబం లోని జనులు అందరికీ రక్షా బంధన్ తాలూకు హృదయ పూర్వక శుభకామనలు. సోదరి కి మరియు సోదరుని కి మధ్య ఉండే చెక్కుచెదరని విశ్వాసాని కి మరియు అంతు లేనటువంటి ప్రేమ కు సమర్పితం అయిన రక్షా బంధన్ తాలూకు ఈ పవిత్రమైన పర్వదినం మన సంస్కృతి యొక్క మంగళప్రదమైనటువంటి ప్రతిబింబం గా ఉన్నది. ప్రతి ఒక్కరి జీవనం లో స్నేహాన్ని, సద్భావన ను ఇంకా, సౌహర్ద భావన ను ఈ పండుగ రోజు మరింత ఇనుమడింప చేయుగాక అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 


(Release ID: 1953538) Visitor Counter : 165