బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలు ఉక్కు ఉత్పత్తికి అవసరమైన దేశీయ కోకింగ్ బొగ్గు లభ్యతను పెంచి దిగుమతులను తగ్గిస్తాయి


కోకింగ్ బొగ్గు ఉత్పత్తి 2030 నాటికి 140 మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా

Posted On: 29 AUG 2023 1:07PM by PIB Hyderabad

        ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ మధ్య సహకారానికి జరిగిన ప్రయత్నాలు  సానుకూల ఫలితాలను ఇచ్చాయి. దేశీయ కోకింగ్ బొగ్గు లభ్యతను మెరుగుపరచడం తో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాయి. దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తి 2030 నాటికి 140 మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. ముడి కోకింగ్ బొగ్గును కడిగిన తర్వాత దాని నుంచి  48 మెట్రిక్ టన్నుల ఉపయోగించదగిన కోకింగ్ బొగ్గు లభిస్తుంది. ఉక్కు ఉత్పత్తికి కీలకమైన కోకింగ్ బొగ్గు లభ్యత పెరిగింది. దేశంలో  ఉక్కు ఉత్పత్తి ద్వారా నడిచే పారిశ్రామిక వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి ఇది  కీలకమైనది.

          జాతీయ ఉక్కు విధానం 2017లో అంచనా వేసినట్లు దేశంలో  కోకింగ్ బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి  బొగ్గు మంత్రిత్వ శాఖ ఆర్థిక సంవత్సరం 2022లో "మిషన్ కోకింగ్ కోల్"ని ప్రారంభించింది. "ఆత్మనిర్భర్ భారత్" ఉపక్రమణ కింద పరివర్తనాత్మక చర్య ద్వారా కోకింగ్ బొగ్గు దిగుమతులను గణనీయంగా తగ్గించాలని ఈ  మిషన్ ఉద్దేశం. ఇందులో   అన్వేషణ, మెరుగైన ఉత్పత్తి, టెక్నాలజీ అనుసరణ,  కోకింగ్ బొగ్గు బ్లాకుల నిర్వహణలో ప్రైవేట్ రంగం ప్రమేయం, కొత్త వాషరీల ఏర్పాటు, పరిశోధన అభివృద్ధి  కార్యకలాపాల పెంపు మరియు నాణ్యత పెంపు వంటి చర్యలు ఉంటాయి.

         ఉక్కు రంగానికి దేశీయ కోకింగ్ బొగ్గు సరఫరాను పటిష్టం  చేయడానికి, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. కోకింగ్ కోల్ ఉపక్రమణలు పెంచడానికి తీసుకున్న చర్యలలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి:

        కోకింగ్ కోల్ బ్లాక్‌ల వేలం: 16 కోకింగ్ కోల్ బ్లాక్‌ల కేటాయింపుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. వీటిలో, 2022-23లో 4 బ్లాక్‌లను వేలం వేయగా, JSW సంస్థ రెండు బ్లాకులను దక్కించుకుంది. దీనివల్ల గణనీయంగా  1.54 మెట్రిక్ టన్నుల  కోకింగ్ బొగ్గు ఉత్పత్తికి  తోడ్పడుతుందని అంచనా వేశారు.

వదిలిపెట్టిన  గనుల పునరుద్ధరణ: భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) యాజమాన్యంలోని పాడుబడిన లేదా వదిలిపెట్టిన గనుల నుండి కోకింగ్ బొగ్గు వెలికితీత/సంగ్రహణం చేపట్టేందుకు ఏజెన్సీ మరియు కంపెనీలను ఆహ్వానించడం ద్వారా BCCL  కొత్త మార్గాలను తెరిచింది.  ఆదాయం పంచుకునే పద్ధతి ద్వారా అమలయ్యే ఈ ఉపక్రమణ గుర్తించిన  8 వదిలివేసిన గనులను పునరుద్ధరించే అవకాశం ఉంది.  ఇప్పటికే వీటిలో 4 గనులకు  LoA జారీ చేయడం జరిగింది. మరో నాలుగు గనుల టెండర్ల ప్రక్రియ యొక్క వివిధ దశల్లో ఉంది.

సెయిల్‌తో వ్యూహాత్మక సహకారం: కోకింగ్ బొగ్గు లభ్యతను పెంచడానికి భారత ఉక్కు సంస్థ (SAIL) , భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) మధ్య 1.8 మెట్రిక్ టన్నుల కడిగిన కోకింగ్ బొగ్గు సరఫరా కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కోకింగ్ బొగ్గు కడిగే 4 కొత్త కోల్ వాషరీలను ప్రారంభించిన తర్వాత బిసిసిఎల్ కడిగిన కోకింగ్ బొగ్గు సరఫరా మరింత పెంచుతుంది.


ముడి కోకింగ్ బొగ్గు వేలం:   ఈ ఏడాది జూన్ నెలలో  BCCL,  సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) కోకింగ్ బొగ్గు వేలం నిర్వహించాయి.
CCL గనుల నుండి 50,000 టన్నుల ముడి కోకింగ్ బొగ్గును వేలంలో టాటా స్టీల్ కొన్నది.  దీనివల్ల దేశీయ వనరుల నుంచి తీసుకోవాలనే నిబద్ధతను దృఢపరుస్తుంది.

వినూత్నమైన గ్రీన్‌ఫీల్డ్ వాషరీస్: కోకింగ్ బొగ్గు లభ్యతను పెంచడానికి  పర్యావరణహితమైన గ్రీన్‌ఫీల్డ్ వాషరీస్ ఏర్పాటును, లేదా ఇప్పటికే ఉన్న BCCL వాషరీలను పునరుద్ధరించడాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే ఉన్న వాషరీల పునరుద్ధరణకు సంబంధించి విధాన ప్రక్రియను BCCL నియమించిన లావాదేవీల సలహాదారు శ్రద్ధగా రూపొందిస్తున్నారు.

      ఈ వ్యూహాత్మక కార్యక్రమాలు దేశీయ కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని బలపరిచే అంకిత భావం పెంపొందించడం తో పాటు, భారతదేశంలో పారిశ్రామిక వృద్ధికి కోకింగ్ బొగ్గు ఉత్ప్రేరకంగా పనిచేసే విస్తృత దార్శనిక స్వావలంబన ప్రోత్సహిస్తాయి. 

***(Release ID: 1953536) Visitor Counter : 83