రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే తొలి బిఎస్ 6 స్టేజ్ 2 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహన ప్రోటోటైప్‌ను ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ
ఇథినాల్ కు మోడీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఇంధన స్వయం సమృద్ధిని సాధించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఊర్జదాత నుంచి పరివర్తన చెందుతూ అన్నదాతలుగా వారికి నిరంతరం తోడ్పడం, పర్యావరణాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడం అన్న లక్ష్యాలకుఅనుగుణంగా ఉంటుందిః శ్రీ గడ్కరీ
Posted On:
29 AUG 2023 3:41PM by PIB Hyderabad
టయోటా కిర్లోస్కర్ మోటార్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే తొలి బిఎస్ 6 స్టేజ్ 2 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికిల్ ప్రోటోటైప్ (మూలరూపం) ను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితన్ గడ్కరీ కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ, కేంద్ర మంత్రి శ్రీ మహేంద్రనాథ్ పాండే, టయోటా ఎండి& సిఇఒ శ్రీ మసకాజు యషిమురా, కిర్లోస్కర్ సిస్టంస్ లిమిటెడ్ ఎండి &సిఇఒ గీతాంజలి కి్ర్లోస్కర్, జపాన్ ఎంబసీకి చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, సలహాదారుల సమక్షంలో బుధవారంనాడు న్యూఢిల్లీలో ప్రారంభించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇథినాల్ దేశీయ, పర్యావరణ అనుకూల, పునరావృత ఇంధనమైనందున భారత్‌కు ఆశాజనకమైన అవకాశాలు ఉన్నాయని శ్రీ గడ్కరీ చెప్పారు. ఇథినాల్ కు మోడీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఇంధన స్వయం సమృద్ధిని సాధించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఊర్జదాత నుంచి పరివర్తన చెందుతూ అన్నదాతలుగా వారికి నిరంతరం తోడ్పడం, పర్యావరణాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడం అన్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఎథినాల్ ఆర్థిక వ్యవస్థ 2 లక్షల కోట్లు అయిన రోజున వ్యవసాయ వృద్ధి రేటు ప్రస్తుతమున్న 12% నుంచి 20%కి చేరుకుంటుందన్నారు. బయోఫ్యూయెల్స్ (జీవ ఇంధనాల)లో ఆవిష్కరణల గురించి మాట్లాడుతూ, అస్సాంలోని నుమాలిగఢ్ లో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ బయో ఇథినాల్‌ను ఉత్పత్తి చేసేందుకు వెదురును ఉపయోగిస్తోందని శ్రీ గడ్కరీ తెలిపారు.


ఈ వినూత్న వాహనం ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడి ఉండటమే కాక, భారత్ నిర్దేశించిన కఠిన ఉద్గారాల ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా నిర్మించి, ప్రపంచంలోనే తొలి బిఎస్ 6 (స్టేజ్ 2) ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహన ప్రోటోటైప్‌ను (మూలరూపాన్ని) చేసిందన్నారు. ఈ ప్రోటోటైప్ కోసం రాబోయే దశలు ఖచ్చితమైన శుద్ధీకరణను, ఆమోదాన్ని, సర్టిఫికేషన్ ప్రక్రియలను కలిగి ఉండనున్నాయని ఆయన తెలిపారు.
****
(Release ID: 1953401)
Visitor Counter : 214