కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఆగస్ట్ 2023 యాక్టివ్ ఖాళీలలో భారీ పెరుగుదలను సాధించిన ఎన్‌సిఎస్
28 ఆగస్టు 2023న 1 మిలియన్ కంటే ఎక్కువ క్రియాశీల ఖాళీలను నమోదు చేసిన ఎన్‌సిఎస్ పోర్టల్
Posted On:
28 AUG 2023 6:59PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ (ఎంఒఎల్‌ఈ)కు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సిఎస్) పోర్టల్ 28 ఆగస్టు 2023న ఒక మిలియన్ కంటే ఎక్కువ క్రియాశీల ఖాళీలను నమోదు చేసింది. ఈ ఖాళీలను ప్రభుత్వ రంగంలోని వివిధ యజమానులు నివేదించారు. ప్రైవేట్ సెక్టార్‌లో వలె ఎన్‌సిఎస్ పోర్టల్‌లో రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికీ తెరవబడి ఉంది. ఎన్‌సిఎస్ పోర్టల్‌లోని ఖాళీలు పోర్టల్‌లో యజమానులచే డైరెక్ట్ రిపోర్టింగ్ మరియు వివిధ ప్రైవేట్ జాబ్ పోర్టల్‌లతో ఏపిఐ ఏకీకరణ ద్వారా సమీకరించబడతాయి.
మిలియన్ క్రియాశీల ఖాళీలలో దాదాపు మూడవ వంతు ఖాళీలు ఫ్రెషర్‌ల ఎంపిక కోసం నోటిఫై చేయబడ్డాయి. ఇది చాలా మంది యువ అభ్యర్థులు వారి విద్య తర్వాత ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్‌సిఎస్‌లో నమోదు చేయబడిన గణనీయమైన సంఖ్యలో ఖాళీలు టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్ మొదలైన ఉద్యోగాలకు సంబంధించినవి ఉన్నాయి.
ఎన్‌సిఎస్‌లో ఖాళీలు వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఇది దేశంలోని పలు రంగాలలో ఉపాధి అవకాశాలను పెరుగుదలను సూచిస్తుంది. ఫైనాన్స్ & ఇన్సూరెన్స్‌లో 51% మరియు రవాణా మరియు నిల్వ విభాగంలో 13% క్రియాశీల ఖాళీలు నివేదించబడ్డాయి. కార్యకలాపాలు & మద్దతు, ఐటీ & కమ్యూనికేషన్, తయారీ మొదలైన ఇతర రంగాలు ఉన్నాయి. ఇవి మొత్తంగా దాదాపు 12% ఖాళీలను అందించాయి మరియు జూన్-ఆగస్టు, 2023లో ఖాళీల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ సమయంలో ఆశించిన డిమాండ్‌తో ఉపాధి అవకాశాల వృద్ధి పెరగవచ్చు. తదుపరి పండుగ సీజన్ ఎన్‌సిఎస్ పోర్టల్‌లోని క్రియాశీల ఖాళీలను కొత్త గరిష్ట స్థాయికి తీసుకువెళుతుంది.
మొత్తం క్రియాశీల ఖాళీలలో 38% ఖాళీలు ఆల్ ఇండియా ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక కోసం పోస్ట్ చేయబడ్డాయి. అయితే బహుళ రాష్ట్రాల్లో అవసరానికి 18% ఖాళీలు ఉన్నాయి. మిగిలిన ఖాళీలు రాష్ట్ర నిర్దిష్ట అవసరాల కోసం కేటాయించబడ్డాయి.
పోర్టల్‌లో 1.5 మిలియన్లకు పైగా యజమానులను నమోదు చేయడంలో ఎన్‌సిఎస్ మరో మైలురాయిని సాధించింది. మెజారిటీ (68%) యజమానులు సేవా కార్యకలాపాలకు చెందినవారు. అనంతరం (26%) తయారీ రంగం ఉంది.
జాబ్ సెర్చ్ మరియు మ్యాచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం మొదలైన వాటిని ఉద్యోగార్ధులకు అందించడానికి మరియు అవసరమైన నైపుణ్యం సెట్‌లతో సరైన అభ్యర్థులను కనుగొనడంలో యజమానులకు సేవ చేయడానికి ఎన్‌సిఎస్ ప్రయత్నిస్తుంది.
****
(Release ID: 1953100)
Visitor Counter : 129