రక్షణ మంత్రిత్వ శాఖ
ఈ ఏడాది నుంచి ఏడవ తరగతి ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యాంశాలలో జాతీయ మన వీర సైనికులకు నివాళి అన్న శీర్షికతో యుద్ధ స్మారక చిహ్నం పై ఒక అధ్యాయం
Posted On:
28 AUG 2023 5:31PM by PIB Hyderabad
ఈ ఏడాది నుంచి ఏడవ తరగతి విద్యార్ధుల ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యాంశాలలో మన వీర శైనికులకు నివాళి అన్న శీర్షికతో జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై ఒక అధ్యాయాన్ని చేర్చడం జరిగింది. పాఠశాల విద్యార్ధులలో దేశభక్తి, విధుల పట్ల అంకిత భావం, సాహసం & త్యాగం వంటి విలువలను పెంపొందించడంతో పాటుగా దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ చొరవను రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ ఉమ్మడిగా చేపట్టాయి.
ఈ అధ్యాయం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (ఎన్‌డబ్ల్యుఎం) చరిత్ర, ప్రాముఖ్యత, దాని భావనతోపాటుగా, స్వాతంత్య్రానంతరం దేశ సేవలో సాయుధ దళాలకు చెందిన సాహస వీరులు చేసిన అత్యున్నత త్యాగాన్ని ను పట్టి చూపడం.ఇద్దరు స్నేహితులు సాహసవీరులు చేసిన త్యాగాల ఫలితంగా తాము అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి కృతజ్ఞతా భావాన్ని పంచుకుంటూ రాసుకున్న లేఖల గురించి ఈ అధ్యాయంలో అభివర్ణణ ఉంటుంది. చారిత్రిక స్మారక చిహ్నాన్ని సందర్శించినప్పుడు పిల్లల మనసులు, హృదయాలలో ఉత్పన్నమయ్యే లోతైన భావోద్వేగ ప్రభావం, దానితో అనుసంధానం కావడాన్ని ఎన్‌సిఆర్‌టి రచయితలు సృజనాత్మకంగా రచించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఎన్‌డబ్ల్యుఎంను 2 5 ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీలో జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ప్రజలలో త్యాగ నిరతిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటుగా దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించిన వీర సైనికులకు తగిన నివాళులర్పించేందుకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది.
***
(Release ID: 1953087)
Visitor Counter : 169