వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జీ20 వాణిజ్య మరియు పెట్టుబడి మంత్రుల సమావేశం సందర్భంగా యూకే ఎస్‌ఒఎస్ ట్రేడ్ కెమి బడెనోచ్ మరియు భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య సమావేశం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పెంచుతుంది.
Posted On:
27 AUG 2023 7:35PM by PIB Hyderabad
జైపూర్‌లో జరిగిన జీ20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రుల సమావేశం (టిఐఎంఎం) తర్వాత భారతదేశ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు యూకే వాణిజ్య శాఖ కార్యదర్శి, శ్రీమతి కెమీ బడెనోచ్ 26 ఆగస్టు 2023న ఢిల్లీలో స్టాక్ టేకింగ్ సమావేశాన్ని సమీక్షించారు. కొనసాగుతున్న ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టిఏ) దీనిపై సమీక్షించారు. అనేక అధ్యాయాలు ఖరారైన గత 12 రౌండ్ల చర్చలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ తదుపరి రౌండ్ చర్చలు కూడా అదే విధంగా విజయవంతం అవుతాయని ఇరువురు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్య సంధానకర్తలు మంత్రులకు ప్రస్తుత స్థితి, పరిష్కారానికి బాకీ ఉన్న సమస్యలు మరియు వాటిని పరిష్కరించేందుకు వారి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల గురించి వివరించారు. ఇద్దరు సీఎన్‌ల ప్రయత్నాలను అభినందిస్తూనే ఒకరి ఆకాంక్షలు మరియు సున్నితత్వాలను ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడంతో మంచి మార్పిడిని కొనసాగించాలని మంత్రులు కోరుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే న్యాయమైన, సమతుల్యమైన మరియు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై ఒక ముగింపుకు చేరుకోవడానికి ఇరువురు నాయకులు తమ అచంచలమైన
నిబద్ధతను వ్యక్తం చేశారు.
జైపూర్‌లో జరిగిన జీ20 టిఐఎంఎంలో ఆమె మద్దతు మరియు నిర్మాణాత్మక భాగస్వామ్యానికి ఎస్‌ఓఎస్ బాడెనోచ్‌కి మంత్రి గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. బి20 సమ్మిట్ ఇండియా 2023 ఈవెంట్‌లలో పాల్గొనాల్సిందిగా ఆయన ఆమెను ఆహ్వానించారు. ఈ సమావేశంలో వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్, డీజీ ట్రేడ్ నెగోషియేషన్స్ అమండా బ్రూక్స్ కూడా పాల్గొన్నారు. ఆగష్టు 2023 చివరి వరకు బృందాలు చర్చలు కొనసాగించబోతున్నాయి, ఆ తర్వాత ఉన్నత స్థాయిలో స్టాక్ టేకింగ్ జరుగుతుంది.
***
(Release ID: 1952771)