సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కాశీ విజ్ఞానం, కర్తవ్యం, సత్యాలకు నిధిగా కాశీ నగరం ప్రసిద్ధి చెందింది; ఇది నిజంగా భారతదేశ సాంస్కృతిక,ఆధ్యాత్మిక రాజధాని:ప్రధాన మంత్రి
భారతదేశంలోని మనం మన శాశ్వత, వైవిధ్యమైన సంస్కృతికి చాలా గర్వపడుతున్నాము; మన అపురూపమైన
సాంస్కృతిక వారసత్వానికి కూడా గొప్ప విలువను ఇస్తున్నాం: ప్రధాని
వారణాసిలో ముగిసిన జి 20 సాంస్కృతిక మంత్రుల సమావేశం
సాంస్కృతిక వారసత్వం గతానికి మూలస్తంభం, భవిష్యత్తుకు మార్గం:
జి. కిషన్ రెడ్డి
సాంస్కృతిక మంత్రిత్వ స్థాయి (మినిస్టీరియల్) ప్రకటనకు కాశీ సాంస్కృతిక మార్గంగా నామకరణం చేయాలని శ్రీ
కిషన్ రెడ్డి విజ్ఞప్తి
Posted On:
26 AUG 2023 5:46PM by PIB Hyderabad
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరిగిన జి20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు.
కాశీగా పిలువబడే వారణాసికి ప్రముఖులను స్వాగతించిన ప్రధాన మంత్రి, ఈ నగరం తన పార్లమెంటరీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ జి 20 సాంస్కృతిక మంత్రుల సమావేశం జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాశీని అత్యంత పురాతన నివాసిత నగరాలలో ఒకటిగా పేర్కొన్న ప్రధాన మంత్రి, బుద్ధ భగవానుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన దీని సమీపంలోని సారనాథ్ పట్టణాన్ని ప్రస్తావించారు. "కాశీ వజ్ఞానం, కర్తవ్యం, సత్యం నిధిగా ప్రసిద్ధి చెందింది ఇది నిజంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మికరాజధాని" అని ప్రధాన మంత్రి అన్నారు. గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించాలని,
సారనాథ్ ను సందర్శించాలని, కాశీ వంటకాలను ఆస్వాదించాలని అతిథులకు సూచించారు. విభిన్న నేపథ్యాలను, దృక్పథాలను అర్థం చేసుకోవడానికి సంస్కృతి అంతర్లీన సామర్థ్యాన్ని ప్రస్తావించిన ప్రధాన మంత్రి, జి - 20 సాంస్కృతిక మంత్రుల బృందం పని మొత్తం మానవాళికి ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు. "భారతదేశంలోని మనం మన శాశ్వత , వైవిధ్యమైన సంస్కృతికి చాలా గర్వపడుతున్నాము. మన అపురూపమైన సాంస్కృతిక వారసత్వానికి కూడా మనం గొప్ప విలువను ఇస్తున్నాము", అని శ్రీ మోదీస్పష్టం చేశారు. భారతదేశం తన వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడానికి
పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో,గ్రామస్థాయిలో దేశ సాంస్కృతిక సంపద, కళాకారులను తీర్చిదిద్దారన్నారు. భారతదేశ సంస్కృతిని కీర్తించడానికి అనేక కేంద్రాలను నిర్మించడాన్ని కూడా ఆయనప్రస్తావించారు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న గిరిజన మ్యూజియంలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇవి భారతదేశ గిరిజన సమాజాల శక్తివంతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి మ్యూజియం గురించి ప్రస్తావిస్తూ, భారతదేశ ప్రజాస్వామిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక రకమైన ప్రయత్నమని అన్నారు. 'యుగే యుగీన్ భారత్' జాతీయ మ్యూజియాన్ని అభివృద్ధి చేయడం గురించి ప్రస్తావిస్తూ, ఇది పూర్తయితే 5,000 సంవత్సరాలకు పైగా ఉన్న భారతదేశ చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Click here for complete text of PM speech
మినిస్టీరియల్ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ, జి.20 దేశాల మంత్రులకు, ఆహ్వానిత దేశాలు , అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు ప్రపంచంలోని పురాతన నిరంతర జీవన నగరాలలో ఒకటైన వారణాసికి ఆహ్వానం పలికారు. ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. గంగానది తీరాన శాశ్వత నగరంగా ఉన్న వారణాసి సంస్కృతి, కళలు, సంప్రదాయాల సంగమాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ జి 20 సాంస్కృతిక మంత్రిత్వ స్థాయి సమావేశానికి ఇది తగిన నేపథ్యంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. సాంస్కృతిక వారసత్వం గతానికి మూలస్తంభం, భవిష్యత్తుకు ఒక మార్గమని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.
జి 20 సాంస్కృతిక బృందం చర్చల సరళి సమ్మిళిత , సహకారాత్మకంగా ఉందని మంత్రి అన్నారు. దీని కింద నాలుగు ప్రాధాన్యతలను గుర్తించడం, చర్చించడం నుండి కార్యాచరణ ఆధారిత ఫలితాల వైపు పురోగమించామని, ఇది ప్రపంచ విధాన రూపకల్పనలో సంస్కృతిని గుండెకాయగా ఉంచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. జి20 సభ్య దేశాల అమూల్యమైన సహకారం, అంతర్దృష్టులు, వ్యాఖ్యలు, ఫీడ్ బ్యాక్ మన భాగస్వామ్య సంభాషణను ఎంతో సుసంపన్నం చేశాయని ఆయన అన్నారు.
భారతదేశ అధ్యక్షతన , ప్రధాని మోదీ నాయకత్వంలో, మనం అర్థం లో మాత్రమే కాకుండా, అన్నింటికంటే ముఖ్యంగా మన సమిష్టి దార్శనికత స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించామని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.
‘సాంస్కృతిక బృందం నాలుగు సమావేశాలలో ఎనిమిది నెలల పాటు, మనం ఒక బలమైన ఫలిత పత్రాన్ని రూపొందించగలిగాము, ఇది రోమ్ , బాలి డిక్లరేషన్ల వారసత్వంలో గణనీయమైన ముందడుగును సూచిస్తుంది‘ అని మంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ సమావేశంలో మన ప్రయత్నాలు మనలను దాదాపు అన్ని అంశాలు ఏకగ్రీవమయిన ఒక ప్రత్యేక స్థితికి తీసుకువచ్చాయని ఆయన పేర్కొన్నారు. “మనం ఆమోదించబోయే తీర్మానం ఆశయం, ముందుచూపు, ఉద్దేశ్యం గురించి మనం గర్వపడాలి. సంస్కృతి అందరినీ ఏకం చేస్తుందని ఇది నిజంగా రుజువు చేస్తుంది ఈ స్ఫూర్తితో ఈ సమావేశ ప్రకటనకు ‘కాశీ సాంస్కృతిక మార్గం‘ అని పేరు పెట్టమని నేను మిమ్మల్ని కోరుతున్నాను” అని ఆయన కోరారు.
సాంస్కృతిక ఆస్తులను తిరిగి పొందడం, సహజ స్థితి కల్పించడం సామాజిక న్యాయ పరంగా అనివార్యమని, ఆ ప్రయోజనం కోసం స్థిరమైన చర్చలకు పరిస్థితులను అనుమతించే మార్గాన్ని నడిపించడానికి జి 20 సభ్యులుగా మనం కట్టుబడి ఉన్నామని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
“ఫలిత పత్రాన్ని, మనం ధృవీకరించిన అధ్యక్ష సంగ్రహ నివేదికను సాంస్కృతిక బృందం రిఫరెన్స్ నిబంధనలను సింబాలిక్ గా స్వీకరిస్తాను" అంటూ ఆయన తన వ్యాఖ్యలను ముగించారు.
భారత జి 20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలోని జి 20 కల్చర్ వర్కింగ్ గ్రూప్(సీడబ్ల్యూజీ) 'జీ20 కల్చర్: షేపింగ్ ది గ్లోబల్ నరేటివ్ ఫర్ ఇన్ క్లూజివ్ గ్రోత్' పేరిట ఒక మార్గదర్శక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత ప్రెసిడెన్సీ వ్యక్తీకరించిన ప్రాధాన్య రంగాలపై గ్లోబల్ థీమాటిక్ వెబినార్ ల నుండి పొందిన అంతర్దృష్టులు , ఉత్తమ పద్ధతులు ఉన్నాయి. నివేదికలో పొందుపరిచిన అంతర్దృష్టులు మన సామూహిక అవగాహనను లోతుగా చేయడంలో నిరంతర నిమగ్నత
ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి.
రికార్డు స్థాయిలో వివిధ సాంస్కృతిక నేపథ్యాలు, విభాగాలకు చెందిన 159 మంది నిపుణులు పాల్గొనడం ఈ వెబినార్ ల ప్రత్యేకత. ఈ విస్తృత సహకారం చర్చలను సుసంపన్నం చేయడమే కాకుండా, ప్రపంచ విధాన రూపకల్పనలో సంస్కృతి పాత్రపై సమగ్ర , బహుముఖ అన్వేషణను ప్రోత్సహించింది. జి 20 సభ్య దేశాలు, అతిథి దేశాలు,
అంతర్జాతీయ సంస్థలు , ఇతర భాగస్వాములకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నిపుణుల సమిష్టి విజ్ఞానం చర్చించిన అంశాల సార్వజనీనతను నొక్కిచెబుతుంది నివేదిక విశ్వసనీయత , లోతును పెంచుతుంది. భారత జి 20 ప్రెసిడెన్సీ సిడబ్ల్యుజి కింద 'కల్చర్ యునైట్స్ ఆల్' అనే హాల్ మార్క్ ప్రచారం ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒక ప్రత్యేక తపాలా స్టాంప్ను కూడా విడుదల చేశారు.
—------
(Release ID: 1952627)
Visitor Counter : 148