యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా 33 ఖేలో ఇండియా కేంద్రాలు ప్రారంభించిన క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
రాజస్థాన్‌లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతుంది. దానికి అంకితమైన ప్రత్యేక క్రీడా విజ్ఞాన కేంద్రం ఉంటుంది: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
23 AUG 2023 4:48PM by PIB Hyderabad
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం ఉదయం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజస్థాన్ రాష్ట్రంలో 33 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించారు. రాజస్థాన్‌లో అదనంగా 18 ఖేలో ఇండియా కేంద్రాలతో పాటు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను, దానికి అంకితమైన ప్రత్యేక క్రీడా విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తద్వారా రాష్ట్రంలో మొత్తం ఖేలో ఇండియా కేంద్రాల సంఖ్య 51కి పెరుగుతుందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఖేలో ఇండియా కేంద్రాల మధ్య ఆటల పోటీలు నిర్వహిస్తామని, శిక్షకులకు శిక్షణ (కోచింగ్ ది కోచెస్) కార్యక్రమాన్ని ఖేలో ఇండియా కేంద్రాలకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు. జాతీయ & అంతర్జాతీయ కోచ్‌ల పర్యవేక్షణలో కోచ్ లకు అలాగే ఖేలో ఇండియా కేంద్రాల కోచ్ లకు (పెద్ద కోచ్ లకు జతచేసి) శిక్షణ ఇవ్వడం జరుగుతుందని
ఇంకా ఈ కార్యక్రమంలో రాజస్థాన్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అశోక్ చందనా, అలాగే రాష్ట్రానికి చెందిన ఇతర ప్రముఖులు, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా సంస్థ (SAI) అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ, “అన్ని రాష్ట్రాలు క్రీడల్లో ఎదగాలన్నది తమ అభిమతమని, క్రీడలపట్ల దృష్టిని కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే భారత్ కు మరిన్ని పతకాలు వస్తాయి" అని మంత్రి అన్నారు.
"ప్రభుత్వం ప్రారంభించిన ఖేలో ఇండియా పథకం, అదే విధంగా ఒలింపిక్ పోడియంపై గురి పథకం విజయవంతం కావడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా మన క్రీడాకారులు అత్యధిక సంఖ్యలో పతకాలు సాధించారు. అది ఒలింపిక్స్ అయినా లేదా పారాలింపిక్స్ అయినా లేదా కామన్వెల్త్ క్రీడలైనా లేదా థామస్ కప్ విజయం వంటి చారిత్రాత్మక సంఘటన అయినా విజయాలు వరించాయి. అంతిమ్ పంఘల్ కూడా రెండు సార్లు ప్రపంచ అండర్ 20 ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అదే విధంగా చదరంగంలో ప్రజ్ఞానానంద FIDE ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నాడు. భారతీయ క్రీడాకారులు నమ్మలేని విజయాలను సాధిస్తున్నారు.
ఇది నమ్మశక్యం కాని దశ. ఎందుకంటే గత 60 ఏళ్లలో ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో 18 పతకాలు మాత్రమే వచ్చాయి. ఈ ఒక్క ఏడాది టోర్నీలో 26 పతకాలు సాధించడం అపూర్వం" అని మంత్రి వివరించారు.
ఖేలో ఇండియా ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ మంత్రి “ఈ విజయాలన్నింటిలో ఖేలో ఇండియా ప్రాతినిధ్యం పెద్దది. ప్రతి సంవత్సరం, చాలా మంది అథ్లెట్లు యూత్, యూనివర్శిటీ మరియు వింటర్ గేమ్స్‌లో పాల్గొంటారు. ఈ పోటీలలో పాల్గొని సాధించిన అనుభవం వారిని పెద్ద పోటీలకు తీసుకువెళుతోంది. రాజస్థాన్ నుండి ఎక్కువ మంది అథ్లెట్లు ఈ ఖేలో ఇండియా కేంద్రాలలో శిక్షణ పొంది మెరుగైన క్రీడాకారులుగా తయారుకాగలరని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత, గత మరియు భవిష్యత్తు క్రీడాకారులు కూడా వీటి ద్వారా పోటీలకు సిద్ధమవుతున్నారు" అని అన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17,000 మంది క్రీడాకారులు ఖేలో ఇండియా కేంద్రాలలో శిక్షణ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాలలో శిక్షణ ఇవ్వడానికి 699 మంది గత ఛాంపియన్లను నియమించడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 960 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రకటించడం జరిగింది. వాటిలో 715 KICలు పనిచేస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రకటిత KICల సంఖ్యా 33. వాటిలో 32 పనిచేస్తున్నాయి. ఈ KICలు సైక్లింగ్, బాస్కెట్‌బాల్, వుషు, హాకీ తదితర క్రీడా విభాగాలలో శిక్షణ ఇచ్చే కేంద్రాలు.
బ్లాక్, జిల్లా స్థాయి పాఠశాలలు, సంస్థలు ఇతర అర్హత ఉన్న ఏజెన్సీలలో అందుబాటులో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాల వినియోగాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసే చిన్న ఖేలో ఇండియా కేంద్రాలు అట్టడుగు స్థాయిలో క్రీడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. గత ఛాంపియన్లు స్వయంప్రతిపత్తి పద్ధతిలో క్రీడా శిక్షణా కేంద్రాన్నినడుపుతూ యువకులకు కోచ్‌లు మరియు మార్గదర్శకులుగా /ఉపదేశకులుగా మారారు. తద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది. గత ఛాంపియన్లకు
క్రీడా శిక్షణ, కోచింగ్ , కేంద్రం నిర్వహణ కోసం ఖేలో ఇండియా పథకం కింద ప్రారంభ మరియు వార్షిక ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది.
*****
(Release ID: 1951987)
Visitor Counter : 121