రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అంతరిక్ష చరిత్రలో భారతదేశం తరపున విశిష్ట అధ్యాయాన్ని లిఖించినందుకు ఇస్రోను అభినందించిన శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
23 AUG 2023 8:42PM by PIB Hyderabad
అంతరిక్ష చరిత్రలో భారతదేశం తరపున విశిష్ట అధ్యాయాన్ని లిఖించినందుకు ఇస్రోను కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అభినందించారు.
చంద్రయాన్-3ని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజవంతంగా దింపినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా చైర్మన్ శ్రీ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ శ్రీ మోహన కుమార్‌కు హృదయపూర్వకంగా అభినందనలు చెబుతూ శ్రీ గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
ఈ ఘనత ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందని శ్రీ గడ్కరీ తన ట్వీట్‌లో వెల్లడించారు. స్థిరమైన అంకితభావం, కచ్చితమైన ప్రణాళిక, అసాధారణమైన బృంద పనితీరు కలిసి అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయని చెప్పారు.
చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయం పట్ల తోటి భారత పౌరులకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి, రాబోయే తరాలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
***
(रिलीज़ आईडी: 1951973)
आगंतुक पटल : 116