రక్షణ మంత్రిత్వ శాఖ
దేశీయ ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణినిని గోవా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించిన ఎల్‌సిఎ తేజస్
Posted On:
23 AUG 2023 5:08PM by PIB Hyderabad
ఆస్ట్రా ఇండిజినస్ బియాండ్ విజువల్ రేంజ్ ( బివిఆర్ -దేశీయ దృశ్య పరిధి ఆవల) ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని గోవా తీరంలో 23 ఆగస్టు 2023న తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) ఎల్ఎస్‌పి- 7 విజయవంతంగా ప్రయోగించింది. విమానం దాదాపు 20,000 అడుగుల ఎత్తు నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా విడుదల చేసింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలను నెరవేర్చిన ఇది, పరిపూర్ణంగా నిర్దేశిత నియమాలను అనుసరించి చేసిన ప్రయోగం,
ఈ ప్రయోగాన్ని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడిఎ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)తోపాటు సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్దీనెస్ అండ్ సెర్టిఫికేషన్ (సిఇఎంఐఎల్ఎసి) అధికారులు, ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ డైరెక్టొరేట్ జనరల్ పర్యవేక్షించారు. విమానాన్ని రెండు సీట్లు గల విమానం చేజ్ తేజస్ పర్యవేక్షించింది.
అత్యంత వ్యూహాత్మక సూపర్‌సానిక్ వాయు లక్ష్యాలను నిమగ్నం చేసి ధ్వంసం చేయగల అత్యంతాధునిక బివిఆర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అయిన ఆస్ట్రాను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డిఆర్‌డిఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ), డిఆర్‌డిఒకు చెందిన ఇతర ప్రయోగశాలలు రూపకల్పన చేసి అభివృద్ధి చేశాయి.
స్వదేశీ ఆస్ట్రా బివిఆర్, దేశీయంగా వృద్ధి చేసిన తేజస్ ఫైటర్ ద్వారా ప్రయోగించడం అన్నది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ప్రధాన అడుగు.
తేజస్ ఎల్‌సిఎ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు ఎడిఎ, డిఆర్‌డిఒ, సిఇఎంఐఎల్ఎసి, డిజి- ఎక్యూఎ, పరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించి, అభినందించారు. ఈ ప్రయోగం అన్నది తేజస్ పోరాట పటిమను విశేషంగా పెంచడమే కాక దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది.
రక్షణ విభాగం (ఆర్&డి) కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ కూడా ఈ విజయవంతమైన ప్రయోగంలో పాలుపంచుకున్న బృందాలను అభినందించారు.
***
(Release ID: 1951961)
Visitor Counter : 199