వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆమోదించిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా క్లౌడ్‌టైల్ చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్


తప్పనిసరి BIS ప్రమాణాలను ఉల్లంఘించి వినియోగదారులకు దేశీయ ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించినందుకు క్లౌడ్‌టైల్‌కు వ్యతిరేకంగా CCPA ఉత్తర్వులు జారీ చేసింది.



వినియోగదారులకు విక్రయించిన అటువంటి 1,033 ప్రెషర్ కుక్కర్‌ల ధరలను రీకాల్ చేసి రీయింబర్స్ చేయడానికి మరియు 45 రోజుల్లో సమ్మతి నివేదికను సమర్పించడానికి CCPA ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.



QCOని ఉల్లంఘించి, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించినందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని క్లౌడ్‌టైల్‌ను ఆదేశించింది.

Posted On: 23 AUG 2023 1:59PM by PIB Hyderabad

క్లౌడ్‌టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్‌ను నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) తోసిపుచ్చింది. తప్పనిసరి BIS ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వినియోగదారులకు దేశీయ ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించడం కోసం కంపెనీ వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆమోదించిన ఆర్డర్‌ను సవాలు చేస్తోంది.

CCPA తన ఆర్డర్‌లోవినియోగదారులకు విక్రయించిన 1,033 యూనిట్ల దేశీయ ప్రెషర్ కుక్కర్‌లను రీకాల్ చేయాలని మరియు రీకాల్ చేసిన ప్రెషర్ కుక్కర్‌ల ధరలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని మరియు 45 రోజుల్లోగా సమ్మతి నివేదికను సమర్పించాలని కంపెనీని ఆదేశించింది. QCOని ఉల్లంఘించివినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించినందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

క్లౌడ్‌టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ "Amazon Basics Stainless Steel Outer Lid Pressure Cooker, 4 L (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు)" అనే ప్రెజర్ కుక్కర్‌ను విక్రయిస్తుంది. https://www.amazon.in/AmazonBasics-Stainless-Steel-Pressure-Cooker/dp/B071G5KNXK URLలో అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులకు ప్రెజర్ కుక్కర్ అమ్మకానికి అందిస్తోంది.

01.02.2021 నుండి అమల్లోకి వచ్చిన QCO ప్రకారందేశీయ ప్రెషర్ కుక్కర్లు ఇండియన్ స్టాండర్డ్ (IS) 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (కన్ఫార్మిటీ అసెస్‌మెంట్) రెగ్యులేషన్స్, 2018 యొక్క షెడ్యూల్ II యొక్క స్కీమ్ ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి.

డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్లు అనేవి ఈరోజుల్లో గృహాలలో అత్యంత సాధారణంగా ఉపయోగించే రోజువారీ వస్తువులలో ఒకటి. అలాగే ఇవి కుటుంబ సభ్యులకు వారి అవసరాలను తీర్చడంలో ఎప్పుడూ ముందు ఉంటాయి. అందువల్ల, QCO యొక్క తప్పనిసరి అవసరాలను ఉల్లంఘించే దేశీయ ప్రెషర్ కుక్కర్ చాలా ప్రాణాంతకం మరియు వినియోగదారుల మరియు ప్రజల జీవితానికి మరియు భద్రతకు ప్రమాదకరమని చెప్పచ్చు.

ప్రస్తుత సందర్భంలోక్లౌడ్‌టైల్ నిర్దేశించిన తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా మరియు BIS నుండి లైసెన్స్ కింద ప్రామాణిక (ISI) గుర్తు లేకుండా వినియోగదారులకు దేశీయ ప్రెజర్ కుక్కర్‌లను విక్రయిస్తున్నట్లు గమనించడం జరిగింది. QCO అమలులోకి వచ్చిన తర్వాత కూడా నాన్-సర్టిఫైడ్ ప్రెషర్ కుక్కర్‌ను క్లౌడ్‌టైల్ భారతదేశంలోని వినియోగదారులకు విక్రయిస్తోంది.

QCO అమల్లోకి వచ్చిన తర్వాతప్రెజర్ కుక్కర్‌ల దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు క్లౌడ్‌టైల్ CCPAకి తన సమాధానంలో సమర్పించింది. దిగుమతిని నిలిపివేసినప్పటికీఅటువంటి ప్రెషర్ కుక్కర్‌లను వినియోగదారులకు విక్రయించడాన్ని కంపెనీ ఆపలేదని CCPA గమనించింది. వాస్తవానికిఈ సమర్పణ స్పష్టంగా QCO గురించి తెలిసినప్పటికీకంపెనీ ఇప్పటికీ అటువంటి ప్రెజర్ కుక్కర్‌లను వినియోగదారులకు పెద్ద ఎత్తున విక్రయిస్తోందని సూచించింది.

CCPA ఆమోదించిన ఆర్డర్‌ను NCDRC ముందు అప్పీల్‌లో క్లౌడ్‌టైల్ సవాలు చేసింది. ఈ అప్పీల్‌ను ఎన్‌సిడిఆర్‌సి ఈరోజు తోసిపుచ్చింది.

 

***



(Release ID: 1951592) Visitor Counter : 148