ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత సామాజిక అభివృద్ధి, రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రధానమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. శ్రీ బి.ఎల్. వర్మ
Posted On:
22 AUG 2023 6:10PM by PIB Hyderabad
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈశాన్య ప్రాంత అభివృద్ధి,సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం డైరెక్టర్, ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఉల్రికా మోడెర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం కింద ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ప్రగతి ని వేగంగా సమీక్షించడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అందిస్తుంది. పర్యవేక్షణ, మూల్యాంకనం, సామర్థ్యం పెంపుదల, ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాక్‌లకు సహకారం పాలనలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల అమలు, ఉత్తమ విధానాలను గుర్తించి అమలు చేయడం లాంటి అంశాల్లో కూడా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అందిస్తుంది.
ఒప్పందంపై సంతకాలు జరిగిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ బి.ఎల్. వర్మ ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఈశాన్య ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి, రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ లక్ష్యాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు, ఆర్థిక వృద్ధి వంటి కీలక రంగాల్లో కార్యక్రమాలు అమలు చేస్తున్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తుందన్నారు. సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకుని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారం అందిస్తున్నదని శ్రీ వర్మ తెలిపారు.
ఈ ప్రాంతంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువతకు జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి నిధులు అందించే అమలు చేస్తున్న PM-DevINE పథకాన్ని రూపొందించడంలో ఈశాన్య ప్రాంత సుస్థిర అభివృద్ధి సూచిక సహాయపడింది అని మంత్రి పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉల్రికా మోడియర్ అభినందించారు.ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా లక్ష్యాల పురోగతిని వేగవంతం చేయడానికి జాతీయ మరియు ఉప జాతీయ ప్రయత్నాలకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారం అందిస్తుందని అన్నారు. కార్యక్రమాలు మరింత సమర్థంగా పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని అన్నారు.
***
(Release ID: 1951588)
Visitor Counter : 174