రక్షణ మంత్రిత్వ శాఖ
కార్వార్ నావికాదళ స్థావరంలో 600 ఫ్లాట్లను ప్రారంభించిన చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్
Posted On:
22 AUG 2023 4:11PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ 21 ఆగస్టు 2023న కార్వార్ నావికాదళ స్థావరాన్ని సందర్శించారు. తన పర్యటనలో భాగంగా, అమధల్లీ, ఆర్గా నావికాదళ స్థావరాలలో నిర్మించిన 600 ఫ్లాట్లను పెద్ద సంఖ్యలో హాజరైన నావికాదళ సిబ్బంది, రక్షణ సిబ్బంది, సాధారణ పౌరుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ 10 రెసిడెన్షియల్ టవర్లకు ఐజిబిసి గోల్డ్ రేటింగ్ కు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, మెరుగుపరిచిన ఇంటీరియర్లు, తోటలు, బహిర్గత సేవలను కల్పించనున్నారు.
ఈ మౌలికసదుపాయాల అభివృద్ధి అంతా ప్రాజెక్టు సీబర్డ్ ఫేజ్ II ఎలో భాగంగా జరుగుతున్నవి. దాదాపు 10,000మంది రక్షణ దళాల, పౌర సిబ్బంది కుటుంబాలను కలిగి ఉండనున్నాయి.
కొనసాగుతున్న నిర్మాణం అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా ఉంటూ 90% సామాగ్రిని సేకరిస్తున్నారు.
అధిక నాణ్యత కలిగిన రక్షణ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాజెక్ట్ సీబర్డ్ చేస్తున్న కృషిని సిఎన్ఎస్ ప్రశంసిస్తూ, మిగిలిన సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
***
(Release ID: 1951256)
Visitor Counter : 132