నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఇరెడ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది..2023-24 ఆదాయ లక్ష్యం ₹ 4,350 కోట్లు

Posted On: 21 AUG 2023 3:15PM by PIB Hyderabad

మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఇరెడ), న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తో  పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఇరెడ 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాలలో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యూహాత్మక లక్ష్యాలను ఎం ఓ యూ వివరిస్తుంది.

ఎం ఓ యూ ప్రకారం భారత ప్రభుత్వం ఇరెడకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ₹ 4,350 కోట్లు మరియు 2024-25కి ₹ 5,220 కోట్లు, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టింది. ముఖ్యంగా, కంపెనీ మునుపటి ఆర్థిక సంవత్సరంలో ₹ 3,361 కోట్ల లక్ష్యం లో  కార్యకలాపాల ద్వారా ₹ 3,482 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

 

నికర విలువపై రాబడి, మూలధనంపై రాబడి, మొత్తం ఎన్‌పిఎ రుణాల నిష్పత్తి , అసెట్ టర్నోవర్ నిష్పత్తి మరియు ప్రతి షేరుపై ఆదాయాలతో సహా ఇతర కీలక పనితీరు పారామితులను కూడా ప్రభుత్వం ఎమ్ఒయులో పేర్కొంది.

 

ఎం ఎన్ ఆర్ ఈ సెక్రటరీ, శ్రీ భూపిందర్ సింగ్ భల్లా మరియు ఇరెడ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ (సీ ఎం డి, శ్రీ ప్రదీప్ కుమార్ దాస్, ఆగస్ట్ 21, 2023న న్యూ ఢిల్లీలోని అటల్ అక్షయ్ ఉర్జా భవన్‌లో ఎం ఎన్ ఆర్ ఈ మరియు ఇరెడ యొక్క ఇతర సీనియర్ అధికారులు ఈ ఎమ్‌ఓయుపై సంతకం చేశారు. 

 

ఇరెడ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ పనితీరు యొక్క అత్యుత్తమ ట్రాక్ రికార్డ్‌ను సీ ఎం డినొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడానికి కంపెనీ బాగా పని చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రుణాల పంపిణీలో 272% వృద్ధి మరియు పన్ను తర్వాత లాభం లో 30% వృద్ధిని సాధించిందని సీ ఎం డి గుర్తుచేసుకున్నారు. సరైన ఆర్థిక నిర్వహణను ప్రదర్శిస్తూ, ఇరెడ నికర నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా గణనీయమైన తగ్గింపును సాధించింది, క్యూ 1, ఎఫ్ వై 2022-23లో 2.92% నుండి క్యూ 1, ఎఫ్ వై 2023-24లో 1.61%కి తగ్గించింది. ఈ విజయాలు పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో ఇరెడ యొక్క అంకితభావాన్ని నొక్కిచెబుతున్నాయని సీ ఎం డి, అన్నారు.

 

ఇరెడ స్థిరమైన శ్రేష్ఠత యొక్క ట్రాక్ రికార్డ్ దాని 'అద్భుతమైన' రేటింగ్ మరియు మునుపటి మూడు ఆర్థిక సంవత్సరాలలో ఎం ఓ యు కోసం పొందబడిన 96 మార్కుల ద్వారా స్పష్టంగా ఉందని సీ ఎం డి, తెలియజేశారు. కంపెనీ, 21 ఆగస్టు 2023 నాటికి, ₹ 1,55,694 కోట్ల సంచిత రుణం మంజూరు మరియు ₹ 1,05,245 కోట్ల రుణం పంపిణీతో 3,137 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసింది మరియు దేశంలో 22,061 ఎం డబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అదనంగా అందించింది.

 

***



(Release ID: 1950940) Visitor Counter : 117