రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీ నుంచి గ‌ఢ్వాల్ ప్రాంతంలోని 6,002 మీట‌ర్ల ఎత్తులో ఉన్న మౌంట్ తెలు శిఖ‌ర ఆరోహ‌ణ‌కు ఎన్‌సిసి బాల & బాలిక‌ల ప‌ర్వ‌తారోహ‌ణ యాత్ర ప్రారంభం

Posted On: 21 AUG 2023 6:27PM by PIB Hyderabad

బాల & బాలిక‌ల నేష‌న‌ల్ కేడెట్ కార్ప్స్  మౌంట్ తెలు శిఖ‌ర ప‌ర్వ‌తారోహ‌ణ యాత్ర‌ను న్యూఢిల్లీలో ఆగ‌స్టు 21, 2023న ఎన్‌సిసి డిజి లెఫ్టెనెంట్ జ‌న‌ర‌ల్ గుర్‌బీర్ పాల్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందంలో వివిధ డైరెక్టొరేట్ల‌కు చెందిన ఐదుగురు అధికారులు, 17మంది శాశ్వ‌త ఇన‌స్ట్ర‌క్ట‌ర్లు, 26మంది (13 మంది బాలురు & 13మంది బాలిక‌లు ఉన్నారు. ఈ బృందం 2023 సెప్టెంబ‌ర్ మూడ‌వ వారంలో మౌంట్ తెలూ శిఖ‌రాన్ని అధిరోహించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.
ఇది 1970 నుంచి 86వ ఎన్‌సిసి క్యాడెట్స్ ప‌ర్వ‌తారోహ‌ణ యాత్ర‌.  ఉత్త‌రాఖండ్‌లోని గ‌ఢ్‌వాల్ హిమాల‌య గంగోత్రి శ్రేణిలో 6,002 మీ / 19,692 అడుగుల ఎత్తులో మౌంట్ తెలు శిఖ‌రం ఉంది. 
క్యాడెట్లు అంద‌రూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ, ప్ర‌శాంత‌త‌, ధైర్యం, వృత్తి నైపుణ్యం, దృఢ సంక‌ల్పంతో స‌వాళ్ళ‌ను ఎదుర్కోవాల‌ని డిజి ఎన్‌సిసిసి వారికి ఉద్బోధించారు. క్యాడెట్లు సాహ‌స కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు పుష్క‌లంగా అవ‌కాశాలు క‌ల్పిస్తూ యువ‌త అభివృద్ధిలో ఎన్‌సిసి ముందంజ‌లో ఉంద‌ని ఆయన తెలిపారు. 

 

***


(Release ID: 1950936) Visitor Counter : 141