ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రసిద్ధ పరమాణు భౌతిక శాస్త్రవేత్త శ్రీ వికాస్ సిన్హా కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 11 AUG 2023 8:43PM by PIB Hyderabad

ప్రసిద్ధ పరమాణు భౌతిక శాస్త్రవేత్త శ్రీ వికాస్ సిన్హా కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ వికాస్ సిన్హా జీ ని విజ్ఞాన శాస్త్రానికి విశేషించి పరమాణు భౌతికశాస్త్రం మరియు ఉన్నత శక్తి సంబంధి భౌతికశాస్త్రం యొక్క రంగాల లో ఆయన అందించినటువంటి చెప్పుకోదగ్గ తోడ్పాటు కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఒక చైతన్యభరితం అయినటువంటి రిసర్చ్ ఇకోసిస్టమ్ ను ముందుకు తీసుకొని పోయేందుకు ఆయన కనబరచినటువంటి ఉత్సాహం స్మరణీయమైంది గా ఉంది. ఆయన కన్నుమూశారని తెలిసి దు:ఖం కలిగింది. ఆయన కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1950710) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam