మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌తో పాటు ఆగస్టు 21 నుండి 24 ఆగస్టు, 2023 వరకు నార్వేలో పర్యటన


ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగంలో భారతదేశం, నార్వే మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

Posted On: 20 AUG 2023 5:32PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌తో కలిసి ఆగస్టు 21 నుండి 24 ఆగస్టు, 2023 వరకు నార్వేలో పర్యటించనున్నారు. ప్రతినిధి బృందంలో జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్), మత్స్య శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఉంటారు.
 

మార్చి, 2010లో ఇరు దేశాలు సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం భారతదేశం, నార్వే మధ్య మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రతినిధి బృందం నార్వే ఫిషరీస్, ఓషన్ పాలసీ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతుంది.

 

2023 ఆగస్టు 22 నుండి 24 వరకు నార్వేలోని ట్రాండ్‌హైమ్‌లో జరిగే ద్వైవార్షిక ఆక్వాకల్చర్ ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్ అయిన ఆక్వా నార్ 2023కి కూడా ప్రతినిధి బృందం హాజరవుతుంది, ఇది ఆక్వాకల్చర్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలలో ఒకటి. ఎగ్జిబిషన్ స్థిరమైన, లాభదాయకమైన ఆక్వాకల్చర్ కోసం తాజా పరిణామాలు, పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. చేపల ఆరోగ్యం, ఫీడ్, జన్యుశాస్త్రం, పరికరాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి ఫిషరీస్  ఆక్వాకల్చర్ విభిన్న అంశాలలో నైపుణ్యం కలిగిన వివిధ నార్వేజియన్ ఎంటర్‌ప్రైజెస్‌తో ప్రతినిధి బృందం సమావేశాలు నిర్వహిస్తుంది. 

ఫిషింగ్ ఓడలు, ఫిషింగ్ హార్బర్‌లు, హేచరీలు, కేజ్ ఫామ్‌లు, సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి ఫిషరీస్, ఆక్వాకల్చర్‌కు సంబంధించి నార్వేలోని అత్యాధునిక సౌకర్యాలను కూడా ప్రతినిధి బృందం సందర్శిస్తుంది. ప్రతినిధి బృందం ఈ రంగాలలో సహకారం, పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తుంది.
ఈ ప్రతినిధి బృందం నార్వేలోని భారతీయ ప్రవాసులతో కూడా చర్చిస్తుంది. మత్స్య రంగంలో భారత ప్రభుత్వం కార్యక్రమాలు, విజయాలను వారికి తెలియజేస్తుంది వారి సలహాలు, అభిప్రాయాన్ని కోరుతుంది.

ఈ పర్యటన మత్స్య రంగంలో భారతదేశం, నార్వే మధ్య పరస్పర అవగాహన, ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరుస్తుందని, భవిష్యత్తులో భాగస్వామ్యం ద్వారా గణనీయమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

 

****



(Release ID: 1950669) Visitor Counter : 110