ఆర్థిక మంత్రిత్వ శాఖ

ముంద‌స్తు తీర్పుల బోర్డు కార్యాచ‌ర‌ణ ప్రారంభం

Posted On: 19 AUG 2023 12:35PM by PIB Hyderabad

 ముంద‌స్తు ఆదేశాల కోసం మూడు బోర్డుల‌ను సెప్టెంబ‌ర్ 2021న ప్ర‌త్య‌క్ష ప‌న్నుల కేంద్ర బోర్డు (సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌) ఏర్పాటు చేసింది. ఇంకా, 2022న జారీ చేసిన నోటిఫికేష‌న్ నెం. 07 ద్వారా, ముంద‌స్తు తీర్పుల మొత్తం ప్ర‌క్రియ‌ను క‌నీస వినిమ‌య సీమ‌తో (ఇంట‌ర్‌ఫేస్‌) చేసేందుకు, ఎక్కువ సామ‌ర్ధ్యం, పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారీత‌నం అందించాల‌నే ల‌క్ష్యంతో ఇ- అడ్వాన్స్ రూలింగ్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.
త‌ర్వాత‌, ఢిల్లీ, ముంబైల‌లో ముంద‌స్తు ఆదేశాలు/  తీర్పుల కోసం బోర్డులు అమ‌లు చేశారు.  ఈ బోర్డులు ఇ-మెయిల్ ఆధారిత విధానాల ద్వారా ప‌ని చేయ‌డం ప్రారంభించి, వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా విచార‌ణ‌ను నిర్వ‌హించ‌డం ప్రారంభించాయి. 
భార‌త్‌లో పెట్టుబ‌డిని పెట్టేముందే ఆదాయ‌పు ప‌న్ను ప‌ట్ల త‌న బాధ్య‌త‌పై ఒక నిశ్చ‌య‌త‌ను ఒక నాన్‌- రెసిడెంట్ పెట్టుబ‌డిదారు పొంద‌వ‌చ్చు. అంతేకాక‌, ఒక స్థానిక సంస్థ కూడా లావాదేవీ ప‌న్నుపై తీర్పును/ ఆదేశాన్ని పొంద‌వ‌చ్చు, దీర్ఘ‌కాలిక వ్యాజ్యాన్ని నివారించ‌వ‌చ్చు. ఎందుకంటే,  మొత్తం రూ. 100 కోట్లు లేదా అంత‌క‌న్నా ఎక్కువ మొత్తాన్ని ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ లావాదేవీల నుంచి ఉత్ప‌న్న‌మ‌య్యే ప‌న్ను బాధ్య‌త గురించి ముంద‌స్తు తీర్పును కోరే స్థానిక ప‌న్ను చెల్లింపుదారునికి కూడా ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఆదాయ‌పు ప‌న్ను అధికారం లేదా అప్పిలేట్ ట్రిబ్యూన‌ల్ ముందు పెండింగ్‌లో ఉన్న వాస్త‌వాలు లేదా చ‌ట్టానికి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌పై ముంద‌స్తు తీర్పుల‌ను పొంద‌డం ద్వారా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.  ముంద‌స్తు తీర్పులు పొందే విధానంపై ప‌న్ను చెల్లింపుదారుల‌కు సాధార‌ణ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, స‌హాయాన్ని అందించేందుకు, ముంద‌స్తు తీర్పుల కోసం బోర్డు హ్యాండ్‌బుక్‌ను సిబిడిటి చైర్మ‌న్ 18 ఆగ‌స్టు 2023న విడుద‌ల చేశారు. ఈ హ్యాండ్ బుక్‌ను అడ్వాన్స్ రూలింగ్స్ పొందే విధానంపై పన్ను చెల్లింపుదారులకు సాధారణ మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించడానికి, అడ్వాన్స్ రూలింగ్స్ కోసం బోర్డు యొక్క హ్యాండ్‌బుక్‌ను CBDT చైర్మన్ 18 ఆగస్టు 2023న విడుదల చేసారు. హ్యాండ్‌బుక్‌ని https://లో యాక్సెస్ చేయవచ్చు. incometaxindia.gov.in/pages/international-taxation/advance-ruling.aspx. అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు. 
వివాదాల నివార‌ణ‌, స‌త్వ‌ర ప‌రిష్కారంలో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ను ఈ సంద‌ర్భంగా సిబిడిటి చైర్మ‌న్ నొక్కి చెప్పారు. ముంద‌స్తు తీర్పుల‌ కోసం బోర్డ‌ల వంటి యంత్రాంగాన్ని సృష్టించ‌డం ఈ దిశ‌లో ఒక ముందడుగు. 

 

***
 



(Release ID: 1950636) Visitor Counter : 133