ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

జి-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ (డి.ఐ.ఏ) సమ్మిట్‌ ను రేపు బెంగళూరు లో ప్రారంభించనున్న - కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్


జి-20 కింద డి.ఈ.డబ్ల్యూ.జి. నాల్గవ సమావేశం నేపథ్యంలో జరుగుతున్న - డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సమ్మిట్

Posted On: 16 AUG 2023 6:37PM by PIB Hyderabad

రేపటి నుండి బెంగళూరులో జరగనున్న జి20-డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సమ్మిట్‌ ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.

జి20 కింద డి.ఈ.డబ్ల్యూ.జి. నాల్గవ సమావేశం నేపథ్యంలో జరుగుతున్న రెండు రోజుల ఈ సదస్సుకు ఇతర జి-20 దేశాల ప్రతినిధులతో సహా ప్రపంచ నిపుణులు, డిజిటల్ నాయకులు హాజరవుతారు.  ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డి.పి.ఐ)’, ‘డిజిటల్ ఎకానమీలో భద్రత’, ‘డిజిటల్ స్కిల్లింగ్’ మొదలైన అంశాలపై ఈ సదస్సు లో సవివరమైన చర్చలు జరుగుతాయి.

ఈ సదస్సు సందర్భంగా కార్పొరేట్ సంస్థలు, అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన ఆవిష్కరణల ప్రదర్శనను కూడా మంత్రి ప్రారంభిస్తారు.

భారత దేశ జి-20 ప్రెసిడెన్సీలో భాగంగా, ఎం.ఈ.ఐ.టి.వై. స్టార్టప్-హబ్ క్రింద జి-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ (జి20-డి.ఐ.ఏ.) కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.  అన్ని జి-20 దేశాల నుండి అంకుర సంస్థలతో పాటు, మానవత్వం యొక్క అత్యంత ముఖ్యమైన అవసరాలను పరిష్కరించడం కోసం ఎడ్-టెక్, హెల్త్-టెక్, అగ్రి-టెక్, ఫిన్-టెక్, సెక్యూర్డ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్క్యులర్ ఎకానమీ అనే ఆరు రంగాల్లో డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తున్న తొమ్మిది ఆహ్వానిత దేశాల వృద్ధిని ఈ కార్యక్రమం గుర్తించి, వేగవంతం చేస్తుంది. 

29 దేశాల నుండి మొత్తం 174 అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.  జి20-డి.ఐ.ఏ. సదస్సులో అంతర్జాతీయ నాయకుల జ్యూరీ ఎదుట, ఈ అంకుర సంస్థలు, తమ ఉత్పత్తులను, ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. 

ఆగస్టు 18వ తేదీన నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంతో ఈ సదస్సు ముగుస్తుంది.  ఇందులో వివిధ విభాగాల్లో 30 అంకుర సంస్థలను సత్కరించనున్నారు.

 

*****



(Release ID: 1949724) Visitor Counter : 161