కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం పెన్షనర్లకు సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్న ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అకౌంట్స్ ఢిల్లీ

Posted On: 16 AUG 2023 6:09PM by PIB Hyderabad

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం మరియు కెవైపి ఫారమ్‌ను అప్‌డేట్ చేయడంలో టెలికాం పెన్షనర్‌లకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ న్యూ ఢిల్లీ కార్యాలయం ఢిల్లీలోని ఎంటిఎన్‌ఎల్‌ ప్రాంగణాల్లో టెలికాం పెన్షనర్ ఫెసిలిటేషన్ క్యాంపులను  నిర్వహిస్తోంది.

పింఛనుదారులు ఈ శిబిరాలకు హాజరు కావాలని సూచించబడింది. జూన్ 2023లో గడువు ముగిసిన లేదా జూలై 2023 నుండి సెప్టెంబర్ 2023 వరకు గడువు ముగియనున్న లైఫ్‌ సర్టిఫికెట్‌ కెవైపిని అప్‌డేట్‌ చేసుకునేందుకు అలాగే స్పాట్‌ వెరిఫికేషన్‌ కోసం పింఛనుదారులు పిపిఓ బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను వెంటతెచ్చుకోవాలని తెలిపారు. ఢిల్లీ సర్కిల్‌లోని దాదాపు 35,000 మంది టెలికాం పెన్షనర్లు ఈ క్యాంపుల ద్వారా సౌకర్యాన్ని పొందుతారు.

పెన్షనర్ ఫెసిలిటేషన్ క్యాంపు షెడ్యూల్ క్రింది విధంగా పేర్కొనబడింది:

 

క్రమ సంఖ్య

స్థానం పేరు

ప్రతిపాదిత తేదీ

1

లక్ష్మీ నగర్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ బిల్డిగ్ఢిల్లీ

17-08-2023

2

ఎంటిఎన్‌ఎల్‌ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్సి-10, యమునా విహార్ ఢిల్లీ

21-08-2023

3

నెహ్రూ ప్లేస్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్ఢిల్లీ

23-08-2023

4

ఎక్స్చేంజ్ బిల్డింగ్, హౌజ్ ఖాస్ ఢిల్లీ

25-08-2023

5

థానా రోడ్నజఫ్‌గఢ్ ఢిల్లీ

28-08-2023

6

ఢిల్లీ కంటోన్మెంట్టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్

01-09-2023

7

 ఎంటీఎన్ఎల్ బిల్డింగ్ సెక్టార్-3, రోహిణి ఢిల్లీ

04-09-2023

8

సిఎస్సి నరేలా ఎక్స్ఛేంజ్

08-09-2023

9

టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్శక్తి నగర్ఢిల్లీ

11-09-2023



(Release ID: 1949720) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Tamil