పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భావోద్వేగంతో ముడిపడిన క్రీడా రంగంలో ప్రతిభను వెలికి తీసి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయడానికి చర్యలు... కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి
' దేశానికి ప్రాధాన్యత ఎల్లపుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా స్ఫూర్తిదాయకంగా రూపొందిన జాతీయ గీతాన్ని,'జయ హే' వీడియో ని ఆవిష్కరించిన మంత్రి
Posted On:
16 AUG 2023 12:36PM by PIB Hyderabad
భారతదేశ 77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా విభాగాల్లో రాణించి భారతదేశానికి కీర్తిని సాధించిన క్రీడాకారులతో కూడిన భారత జాతీయ గీతాన్ని కేంద్ర .గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి నిన్న ఇక్కడ విడుదల చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో జాతీయ గీతాన్ని రూపొందించడానికి సహకరించింది.
ఈ సందర్భంగా శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ “భారతదేశంలో క్రీడలు భావోద్వేగంతో ముడిపడి ఉన్నాయి . భారతదేశ క్రీడా ప్రతిభను వెలికి తీసి దేశాన్ని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. క్రీడారంగంలో గెలుపు ఓటమి కాదు, క్రీడా స్ఫూర్తి ముఖ్యం. క్రీడాకారుల క్రీడాస్ఫూర్తి దేశానికి గౌరవాన్ని తీసుకు వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇండియన్ ఆయిల్ ప్రారంభించిన క్రీడా గీతం క్రీడల పట్ల దేశం అభిరుచిని పెంపొందించి క్రీడల అభివృద్ధికి సహకరిస్తుంది.పారా-అథ్లెటిక్స్‌తో సహా అన్ని క్రీడలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ' దేశానికి ప్రాధాన్యత ఎల్లపుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత' అనే సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది." అని అన్నారు. ' దేశానికి ప్రాధాన్యత ఎల్లపుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయం సాకారం అయ్యేలా చూసేందుకు వీడియో రూపొందించారు.
శ్రీ పూరి 'జయ హే' అనే పేరుతో ఒక స్ఫూర్తిదాయకమైన మ్యూజిక్ వీడియోను కూడా ఆవిష్కరించారు, ' దేశానికి ప్రాధాన్యత ఎల్లపుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత' అని సూచించే సృజనాత్మక వ్యక్తీకరణ, జీవితంలోని ప్రతి కోణాన్ని , సమగ్ర పురోగతిని సూచించే విధంగా వీడియోని రూపొందించారు.
ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి గుర్తింపు సాధించడానికి అంకితభావం,నిబద్ధతతో అథ్లెట్లు చేసిన కృషిని కళ్ళకు కట్టే విధంగా వీడియో రూపొందింది. యుక్త వయస్సులో నైపుణ్యం సాధించి, అపూర్వ విజయాలు సాధించడానికి కృషి చేస్తున్న వారికి స్ఫూర్తి లక్ష్యంగా వీడియో ను సిద్ధం చేశారు.
***
(Release ID: 1949385)