విద్యుత్తు మంత్రిత్వ శాఖ

తొలి త్రైమాసికంలో అత్యధిక స్వతంత్ర 'పన్ను తర్వాతి లాభాన్ని' నమోదు చేసిన ఎన్‌హెచ్‌పీసీ

Posted On: 12 AUG 2023 7:12PM by PIB Hyderabad

భారతదేశంలో ప్రధాన జల విద్యుత్ సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యధిక స్వతంత్ర 'పన్ను తర్వాతి లాభం' (ప్యాట్‌) రూ.1,053 కోట్లను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే  త్రైమాసికంలో రూ.1050 కోట్ల లాభం నమోదు చేసింది. క్యూ1 ఎఫ్‌వై24 ఫలితాలను ఈ నెల 11న జరిగిన సమావేశంలో ఎన్‌హెచ్‌పీసీ బోర్డు ఆమోదించింది.


ఎన్‌హెచ్‌పీసీ పునరుత్పాదక విద్యుత్‌ (పవన & సౌర విద్యుత్‌ సహా) స్థాపిత సామర్థ్యం 7097.2 మెగావాట్లు. సంస్థకు చెందిన 25 విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అనుబంధ సంస్థల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 1520 మెగావాట్లు కూడా ఇందులో కలిసి ఉంది.

 

***



(Release ID: 1948320) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Tamil