ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.

Posted On: 12 AUG 2023 9:26AM by PIB Hyderabad

ఎక్సలెన్సీస్, 

సోదర సోదరీమణులారా, నమస్కార్

 

జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది.  ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.

మిత్రులారా,అవినీతి ప్రభావం ఎలా ఉంటుందో ఎంతోమంది పేదలు, అణగారిన వర్గాలు అనుభవించారు. ఇది వనరుల సద్వినియోగంపై ప్రభావం చూపుతుంది.మార్కెట్లను దారితప్పిస్తుంది. సేవలపై ప్రభావం చూపుతుంది. చివరికి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయేలా చేస్తుంది. ప్రభుత్వ వనరులను , ప్రజల సంక్షేమం కోసం గరిష్ఠస్థాయిలో వినియోగించడం ప్రభుత్వం బాధ్యత అని కౌటిల్యడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అవినీతిపై పోరాటం చేయాలి. అదువల్ల అవినీతిపై పోరాటం మన ప్రజల పవిత్ర ధర్మం. మిత్రులారా, 

అవినీతిపై భారత్ ఏమాత్రం ఉపేక్షవహించని విధానాన్ని అనుసరిస్తున్నది. మనం పారదర్శకమైన, జవాబుదారిత్వంతో కూడిన వ్యవస్థను అందించేందుకు సాంకేతికత,  ఈ గవర్నెన్స్ ను ఉపయోగించుకుంటున్నాము. సంక్షేమ పథకాల విషయంలో ఏవైనా లీకేజీలు, అంతరాలు ఉంటే వాటిని అరికట్టడం జరుగుతోంది. భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు , తమ బ్యాంకు ఖాతాలలోకి ప్రత్యక్ష నగదు బదిలీని అదుకున్నారు.  ఈ నగదు బదిలీల విలువ సుమారు 360 బిలియన్ డాలర్లు దాటింది. దీనితో ప్రభుత్వానికి 36 బిలియన్ డాలర్లు ఆదా అయింది.

వ్యాపారాలకు సంబంధించి మనం పలు విధానాలను సులభతరం చేశాం.ఆటోమేషన్, ప్రభుత్వసేవల డిజిటైజేషన్ వంటివి రెంట్ కోరే అవకాశాలు లేకుండా చేశాయి ప్రభుత్వం చేపట్టిన  ఈ మార్కెట్ ప్లేస్, లేదా జి.ఇ.ఎం పోర్టల్ ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ లో  పెద్ద  ఎత్తున పారదర్శకత తీసుకువచ్చింది. అలాగే ఆర్థిక నేరగాళ్ల కేసులను సత్వరం పరిశీలిస్తున్నాం. 2018లో ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని తీసుకువచ్చాం. అప్పటినుంచి మేం, ఆర్థికనేరగాళ్లు. పరారీలోని ఆర్థిక నేరగాళ్లనుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువగల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 12 బిలియన్ డాలర్ల విలువగల ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

ఎక్సలెన్సీస్....

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల సమస్య జి20 దేశాలు అన్నింటికీ సవాలు వంటిది. ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ కు ఇది సమస్య.2014లో నా తొలి జి20 సమావేశ ప్రసంగంలో, ఈ అంశంపై నేను మాట్లాడాను.

పరారీలో ఉన్న ఆర్థిక నేరాగాళ్లసమస్యకు సంబంధించిన ఆస్తుల స్వాధీనానికి,నేను 2018 నాటి జి.20 సమావేశంలో ,   తొమ్మిది అంశాల అజెండాను ప్రతిపాదించాను. మీ బ్రుందం ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మూడు ప్రాధాన్యతా అంశాలపై , కార్యాచరణతో కూడిన ఉన్నత స్థాయి సూత్రాలను మేము స్వాగతిస్తున్నాము. అవి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా చట్ట అమలు యంత్రాంగాలమధ్య సహకారం,  ఆస్తుల రివరీ మెకానిజంను బలోపేతం చేయడం, అవినీతి నిరోధక అథారిటీల సమగ్రతను,ప్రభావాన్ని పెంచడం వంటివి  ఉన్నాయి.

చట్ట అమలు విభాగాల మధ్య పరస్పర సహకారం కుదిరినదని తెలిసి సంతోషిస్తున్నాను. దీనివల్ల చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని నేరగాళ్లు దేశ సరిహద్దులు దాటిపోకుండా చూడడానికి వీలుకలుగుతుంది. సకాలంలో ఆస్తుల గుర్తింపు, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును గుర్తించడం వంటివి కూడా ఎంతో ముఖ్యమైనవి. దేశీయంగా ఆయా దేశాలు నేరస్తుల ఆస్తుల రికవరీకి పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించవలసి ఉంది.విదేశీ ఆస్తుల స్వాధీనానికి సంబంధించి, జి 20 దేశాలు  ఒక ఉదాహరణగా నిలవవచ్చు. ఇది నేరస్థులను, తగిన న్యాయప్రక్రియ అనంతరం సత్వరం అప్పగించడానికి వీలు కలిగిస్తుంది ఇది అవినీతి వ్యతిరేక పోరాటం విషయంలో మన  ఉమ్మడి సంకేతాన్ని పంపుతుంది.

జి 20 దేశాలుగా మనం, సమష్టి క్రుషి ద్వారా , అవినీతికి వ్యతిరేక చెప్పుకోదగిన మద్దతు నివ్వగలం. అంతర్జాతీయ సహకారాన్నిపెంచడం, అవినీతికి మూలకారణమైన సమస్యలపై చర్యలు తీసుకోవడం వంటి వాటిద్వారా గణనీయమైన మార్పు తీసుకురాగలం. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆడిట్ సంస్థలకు తగిన పాత్ర  ఇవ్వవలసి ఉంది. వీటన్నింటికీ మించి, మన పాలనా, న్యాయవ్యవస్థలను మనం బలోపేతం చేసుకోవలసి ఉంది. మనం విలువల సంస్క్రుతిని పెంపొందించుకోవడంతో పాటు,  సమగ్రతను మన విలువల వ్యవస్థలో ఉండేట్టు చూసుకోవాలి. అలా చేసినప్పుడు మనం న్యాయబద్ధమై, సుస్థిర సమాజానికి పునాది వేయగలం. ఈ సమావేశాలు విజయవంతం కాగలవని, మంచిఫలితాలు ఇవ్వగలవని ఆకాంక్షిస్తున్నాను. 

నమస్కార్!

 

***


(Release ID: 1948156) Visitor Counter : 119