వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించడానికి 11 రాష్ట్రాల్లోని 49 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమం


ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల సహకారంతో కలిసి జూలై 25 నుంచి ఈ రోజు వరకు భారీ ఎత్తున ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు

కార్యక్రమంలో భాగంగా 3500 హెక్టార్లలో ఆయిల్ పామ్ మొక్కలు నాటిన దాదాపు 7000 మంది రైతులు

Posted On: 12 AUG 2023 11:58AM by PIB Hyderabad

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్ కింద  ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లతో  కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగు  ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.  2023 జూలై 25న  'మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్' ప్రారంభమయింది.  వంట నూనెల ఉత్పత్తిలో స్వావలంబన సాధించి రైతులను ప్రోత్సహించడానికి కార్యక్రమం అమలు జరిగింది. 2025-26 నాటికి ఆయిల్ పామ్ ఉత్పత్తిలోకి   6.5 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణాన్ని తీసుకురావాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కార్యక్రమం  దోహదపడుతుంది.

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కర్ణాటక, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకం ఎక్కువగా జరుగుతోంది. .పతంజలి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, గోద్రేజ్ అగ్రోవెట్, 3 ఎఫ్ వంటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఈ కార్యక్రమంలో  చురుకుగా పాల్గొన్నాయి. వీటితో పాటు కేఈ కల్టివేషన్, నవభారత్ వంటి ఇతర ప్రాంతీయ సంస్థలు కూడా కార్యక్రమంలో  పాల్గొన్నాయి. మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం  2023 ఆగస్టు 12 న ముగిసింది. కార్యక్రమంలో భాగంగా  11 రాష్ట్రాల్లోని 49 జిల్లాల్లోని 77 గ్రామాలలో సుమారు 3500 హెక్టార్లలో 7000 మందికి పైగా రైతులు ఆయిల్ పామ్ సాగు ప్రారంభించారు.  5.00 లక్షలకు పైగా ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. 

మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉత్పత్తి ఎక్కువ చేయడానికి రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. విభాగం అధికారుల సహకారంతో రైతుల కోసం సాంకేతిక శిక్షణ తరగతులు నిర్వహించారు. అధికారులు, రైతులకు సాంకేతిక అంశాలపై మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరిగాయి.  ఉత్పత్తి ఎక్కువ చేసి ఎక్కువ ఆదాయం లభించేలా చూసేందుకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు.

జాతీయ స్థాయిలో నిర్వహించిన  మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకులు, శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సభ్యులు పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ పథకం కింద రైతులకు నాణ్యమైన మొక్కలు పంపిణీ చేసి అంతర పంటలతో సహా  పంట నిర్వహణ కోసం  ఆర్థిక సహాయం సహా వివిధ ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు. అదనంగా, రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించేలా చూసేందుకు మార్కెటింగ్ సౌకర్యం కూడా అందిస్తారు. 

1. కర్ణాటక రాష్ట్రం బీదర్ లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

2. త్రిపుర లోని జిరాని అగ్రిల్ జిల్లా లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్రిపుర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ నాధ్  ప్రారంభించారు.

3. అస్సాం తినిసుకియా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అటుల్ బోరా, స్వామి రాందేవ్ జీ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 1948152) Visitor Counter : 178