మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ పాల దినోత్సవం (నవంబర్ 26, 2023) సందర్భంగా జాతీయ గోపాల్ రత్న అవార్డు -2023 ప్రదానం


నేషనల్ అవార్డ్ పోర్టల్ https://awards.gov.inwill ద్వారా 15.08.2023 నుండి ఆన్ లైన్ లో నామినేషన్ల స్వీకరణ
నామినేషన్లు/దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15.09.2023

సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, జ్ఞాపిక , నగదు బహుమతితో 3 కేటగిరీలలో అవార్డు ప్రదానం

పాలు ఉత్పత్తి చేసే రైతులు, పాడి సహకార సంఘాలు/ఎఫ్ పి ఒ లు, కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడం ఈ అవార్డుల ప్రదానం ఉద్దేశం

Posted On: 11 AUG 2023 1:03PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ 2023 సంవత్సరానికి గాను జాతీయ గోపాల్ రత్న అవార్డు కోసం 15.08.2023 నుంచి జాతీయ అవార్డు పోర్టల్  https://awards.gov.in ద్వారా ఆన్ లైన్  నామినేషన్లను ఆహ్వానిస్తోంది. నామినేషన్లు/ దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీ 15.09.2023.

 

రైతులకు సుస్థిర జీవనోపాధి కల్పించేందుకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. భారతదేశంలోని స్వదేశీ గోజాతులు దృఢమైనవి. జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే జన్యు సామర్థ్యాన్ని అవి కలిగి ఉన్నాయి. దేశవాళీ గోజాతులను శాస్త్రీయ పద్ధతిలో pసంరక్షించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 2014 డిసెంబర్ లో 'రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్ జీఎం)'ను ప్రారంభించారు.

 

పాలను ఉత్పత్తి చేసే రైతులు, డెయిరీ కోఆపరేటివ్ సొసైటీలు/ ఎఫ్ పి ఒ లు, ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ టెక్నీషియన్స్ (ఎఐటి )లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్ జీఎం కింద 2023లో ఈ శాఖ  కింది కేటగిరీలలో జాతీయ గోపాలరత్న అవార్డును ప్రదానం చేస్తోంది. 

 

i.రిజిస్టర్డ్ స్వదేశీ పశువులు/ గేదె జాతుల ఉత్తమ పాడిరైతు పెంపకం (రిజిస్టర్డ్ జాతుల జాబితా జతచేయబడింది) లో ఉత్తమ రైతు 

ii.బెస్ట్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ (డి సి ఎస్ )/ పాల ఉత్పత్తి సంస్థ (ఎం పి సి )/ డెయిరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ పి ఒ)

iii.ఉత్తమ కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ (ఎఐటి).

 

జాతీయ గోపాల్ రత్న అవార్డు 2023లో మొదటి రెండు కేటగిరీలలో అంటే ఉత్తమ పాడి రైతు, ఉత్తమ డి సి ఎస్/ ఎఫ్ పి ఒ /ఎం పి సి లకు కింది విధంగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్, జ్ఞాపిక, నగదు లభిస్తుంది.

 

*మొదటి ర్యాంకుకు రూ.5,00,000/-(రూ.5 లక్షలు )

*రెండో ర్యాంకుకు రూ.3,00,000/- (రూ.3 లక్షలు మాత్రమే)

*3వ ర్యాంకుకు రూ.2,00,000/- (రూ.2 లక్షలు మాత్రమే)

 

బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ టెక్నీషియన్ (ఎఐటి ) కేటగిరీలో మూడు ర్యాంకులకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, జ్ఞాపిక ఇస్తారు.

 

జాతీయ పాల దినోత్సవం (నవంబర్ 26, 2023) సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అర్హతలు, ఆన్ లైన్ నామినేషన్ ప్రక్రియ గురించి మరింత సమాచారం కోసం వెబ్ సైట్ https://awards.gov.in లేదా https://dahd.nic.inmay లను సందర్శించవచ్చు.

 

రిజిస్టర్డ్ జాతుల పశువులు (ఎన్ జి ఆర్ఎ 2023 కోసం)

  

 

S.N.

బ్రీడ్

ప్రాంతం 

1

అమృత్ మహల్ 

కర్ణాటక 

2

బచౌర్ 

బీహార్ 

3

బర్గుర్ 

తమిళనాడు 

4

డంగి 

మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ 

5

దియోని

మహారాష్ట్ర అండ్ కర్ణాటక 

6

గొలవో 

మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ 

7

గిర్

గుజరాత్ 

8

హల్లికర్ 

కర్ణాటక 

9

హరియానా 

హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ 

10

కంగయామ్ 

తమిళనాడు 

11

కంక్రేజ

గుజరాత్ అండ్ రాజస్థాన్ 

12

కెంకేత 

ఉత్తర ప్రదేశ్ అండ్ మధ్య ప్రదేశ్ 

13

ఖేరీ ఘడ్ 

ఉత్తర ప్రదేశ్ 

14

ఖిల్లర్

మహారాష్ట్ర అండ్ కర్ణాటక 

15

కృష్ణ వ్యాలీ 

కర్ణాటక 

16

మాల్వి

మధ్య ప్రదేశ్ 

17

మేవటి 

రాజస్థాన్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ 

18

నగోరి

రాజస్థాన్ 

19

నిమారి

మధ్యప్రదేశ్

20

ఒంగోలు 

              ఆంధ్రప్రదేశ్ 

21

పొన్వర్ 

ఉత్తర ప్రదేశ్

 

22

పుంగనూరు 

            ఆంధ్రప్రదేశ్

23

రతి 

రాజస్థాన్

24

రెడ్ కాంధరి

మహారాష్ట్ర  

25

రెడ్ సింది 

సంఘటిత క్షేత్రాలు మాత్రం 

26

సహివల్

పంజాబ్ అండ్ రాజస్థాన్ 

27

సిరి 

సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ 

28

తర్పర్కర్ 

రాజస్థాన్ 

29

అంబ్లాచేరి 

తమిళనాడు 

30

వేచుర్ 

కేరళ 

31

మోటు 

ఒడిశా, ఛత్తీస్ ఘడ్ అండ్ ఆంధ్రప్రదేశ్

32

ఘుముసరి 

ఒడిశా 

33

బింజార్పురి 

ఒడిశా 

34

ఖరియర్ 

ఒడిశా 

35

పులికులం 

తమిళనాడు 

36

కొసలి 

ఛత్తీస్ ఘడ్ 

37

మల్నాడ్ గిద్ద 

కర్ణాటక 

38

బలహి 

హర్యానా అండ్ చండీఘర్ 

39

గంగ తిరి 

ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ 

40

బద్రి 

ఉత్తరాఖండ్ 

41

లక్ష్మి 

అస్సాం 

42

లదాఖి 

జమ్మూ అండ్ కాశ్మీర్ 

43

కొంకణ్ కపిల 

మహారాష్ట్ర అండ్ గోవా 

44

పొడ తూర్పు 

తెలంగాణ 

45

నారీ 

  రాజస్థాన్ అండ్ గుజరాత్ 

46

డాగ్రి 

గుజరాత్ 

47

తుతో 

నాగాలాండ్ 

48

శ్వేత కపిల 

                  గోవా 

49

హిమాచల్ పహరి 

హిమాచల్ ప్రదేశ్

50

పూర్నియా 

బీహార్ 

51

కథని 

మహారాష్ట్ర 

52

సంచోరి 

రాజస్థాన్ 

53

మశిలుం

 

 


(Release ID: 1948044) Visitor Counter : 187