రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతిని కలుసుకున్న భారత తపాలా సేవల ప్రొబేషనర్లు
Posted On:
11 AUG 2023 12:55PM by PIB Hyderabad
భారతీయ తపాలా సేవలు (2021-2022 బ్యాచ్) ప్రొబేషనర్లు గురువారం (11 ఆగస్టు, 2023) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 160 ఏళ్ళ ఉత్కృష్ట ప్రయాణంతో తపాలా విభాగం దేశంలో సేవకు కరదీపికగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. దాదాపు 1,60,000 పోస్ట్ ఆఫీసులతో గల విస్త్రతమైన నెట్‌వర్క్ ఈ శాఖను ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌ను చేస్తుందన్నారు. మన దేశంలోని భిన్న సంస్కృతులను సంప్రదాయాలను కలిపే ఒక ఆధారంగా భారతీయ పోస్టల్ నెట్‌వర్క్ పని చేస్తుందని ఆమె అన్నారు.
ఆర్థికంగా కలుపుకుపోవడంలో తపాలా విభాగం పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారు. ఆర్ధిక వ్యత్యాసలు తొలగించి, బలహీనవర్గాల సాధికారత కోసం వ్యూహాత్మక చొరవలను విభాగం చేపట్టడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాయితీలను పంచడం, సంక్షేమ, ఫించను చెల్లింపులలో పోస్టల్ విభాగం కీలక పాత్ర పోషించిందని ఆమె అన్నారు. పోస్టాఫీసుల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా, సాఫీగా నిధుల పంపిణీ జరగడం అన్నది మధ్యవర్తులపై ఆధారపడటాన్నేకాక , లీకేజీలను తగ్గించిదని పేర్కొన్నారు.
భారత తపాల సేవల అధికారుల పాత్ర దేశ ప్రజలకు సేవ చేయడం చుటూ్ట తిరుగుతూ ఉంటుంది కనుక వినియోగదారుడే కేంద్రమన్న విధానం అవసరమని రాష్ట్రపతి చెప్పారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాంట్ మెస్సేజింగ్‌ల యుగంలో, తన ఉనికిని, ఉపయుక్తతను కొనసాగించేందుకు తపాలా విభాగం కాలానుగుణంగా ఎదగాలని ఆమె అన్నారు. డిజిటల్ భూమికను అనుసరించేందుకు విభాగం తన సేవలను చురుకుగా ఆధునీకరిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో యువ ప్రొబేషనర్ల వినూత్న భావనలు అమూల్యమైనవని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ఉపన్యాసం కోసం ఇక్కడ నొక్కండి-
(Release ID: 1948042)
Visitor Counter : 140