ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్యూ1 ఉత్పత్తి, అమ్మకాల్లో రికార్డ్‌ స్థాయి పనితీరును ప్రదర్శించిన సెయిల్

Posted On: 11 AUG 2023 9:18AM by PIB Hyderabad

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), ఈ ఏడాది జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాల్లో ముఖ్యాంశాలు:

క్యూ1ఎఫ్‌వై24లో సెయిల్‌ పనితీరు (స్వతంత్ర ఖాతాల ప్రకారం):

 

యూనిట్‌

క్యూ1 2022-23

క్యూ4 2022-23

క్యూ1 2023-24

ముడి ఉక్కు ఉత్పత్తి

మిలియన్‌ టన్నులు

4.33

4.95

4.67

అమ్మకాలు

మిలియన్‌ టన్నులు

3.15

4.68

3.88

ఆదాయం

₹ కోట్లలో

24,029

29,131

24,358

వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ చెల్లింపులకు ముందు ఆదాయం (ఎబిటా)

₹ కోట్లలో

2,606

3,401

2,090

పన్నుకు ముందు లాభం (పీబీటీ)

₹ కోట్లలో

1,038

1,480

202

పన్ను తర్వాత లాభం (ప్యాట్‌)

₹ కోట్లలో

776

1,049

150

 

ఉత్పత్తి, విక్రయాలకు సంబంధించి, ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో, కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ క్యూ1 ఫలితాలను సెయిల్‌ ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, కంపెనీ ముడి ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు వరుసగా 8%, 23% పెరిగాయి. వాల్యూమ్‌లు పెరిగినా, ధరలు తగ్గడం వల్ల టర్నోవర్ 1% మాత్రమే పెరిగింది.

కోకింగ్ కోల్‌ ధరలు స్థిరపడడం, దేశంలో వినియోగ వృద్ధి సానుకూలంగా ఉండటంతో కంపెనీ లాభాలు పెరిగే అవకాశం ఉంది. మధ్యస్థ కాలంలో లాభదాయకతను పెంచుకోవడానికి కీలక ప్లాంట్లలో కార్యకలాపాలు, సమర్థతను పెంచే ప్రాజెక్టులను కూడా కంపెనీ చేపడుతోంది.

 

***


(Release ID: 1948037) Visitor Counter : 114