మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పొగాకు ఉత్పత్తుల హానికర ప్రభావాల నుంచి పాఠశాలకు వెళ్లే బాలల సంరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 09 AUG 2023 4:06PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన  సమాచారం ప్రకారం 13 నుంచి 15 సంవత్సరాల మధ్యవయస్కులైన యువతలో సిగరెట్టు, బీడీ కాల్చడం, పొగలేని పొగాకు వినియోగంపై గ్లోబల్  యూత్  టుబాకో సర్వే (జివైటిఎస్-4) నిర్వహించారు. ఈ సర్వే ప్రచురించిన నేషనల్ ఫాక్ట్ షీట్ ప్రకారం జనాభాలో సిగరెట్  తాగే అలవాటు  ప్రారంభమయ్యే సగటు వయసు 11.5 సంవత్సరాలుండగా బీడీ కాల్చే అలవాటుకు 1.05 సంవత్సరాలు, పొగరాని పొగాకు వినియోగంలో 9.9 సంవత్సరాలు ఉంది.

పొగాకు ఉత్పత్తుల హానికర ప్రభావం నుంచి పాఠశాల విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం, వర్తక వాణిజ్యాలు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ) చట్టం 2003 సెక్షన్ (ఎ)తో (కోప్టా) సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం, వర్తక వాణిజ్యాలు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ) సవరణ నిబంధనలు 2011తో కలిపి పరిశీలించినట్టయితే 18 సంవత్సరాల లోపు వయస్కులకు పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించడంతో పాటు కోప్టా 2003 సెక్షన్ 6బి కింద విద్యాసంస్థలకు 100 గజాల దూరంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు.   

అలాగే కోప్టా 2003 సెక్షన్-6 ప్రకారం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోప్టా 2003  సెక్షన్-6 సమర్థవంతంగా అమలు చేయడానికి ‘‘పొగాకు రహిత విద్యా సంస్థలు (సవరణ) మార్గదర్శకాలు’’ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల అమలుకు రాష్ర్టాల విద్యా సంస్థలు కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే వివిధ పొగాకు వ్యతిరేక ప్రచార కార్యక్రమాల ద్వారా పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక ప్రభావాలపై క్రమం తప్పకుండా, చైతన్యానికి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజారోగ్యం రాష్ర్ట జాబితాలోని అంశం కావడం వల్ల కోప్టా 2003 నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్టప్రభుత్వాలదే అవుతుంది. విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం ప్రకారం పొగాకు రహిత విద్యా సంస్థల మార్గదర్శకాలను రాష్ర్టాలు,  కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ 2019 సెప్టెంబరు 17వ తేదీన పంపారు. 2020 డిసెంబరు 18, 2021 జనవరి 8, 2022 జూలై 7వ తేదీల్లో కూడా ఈ లేఖను తిరిగి పంపారు. విద్యా సంస్థలను పొగాకు రహితంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పౌర సమాజ సంఘాల పాత్ర, బాధ్యతలను కూడా ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ప్రజారోగ్యం రాష్ర్ట జాబితాలోని అంశం కావడం వల్ల ఈ మార్గదర్శకాలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్టప్రభుత్వాలదే అవుతుంది.

దీనికి తోడు ఆయుష్మాన్  భారత్  కింద పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమం (ఎస్ హెచ్ పి) కింద రోల్ ప్లే, జానపద నాట్యం,  పోస్టర్ తయారీ, సృజనాత్మక రచనలు, గోష్ఠి, చర్చ, నైపుణ్యాల నిర్మాణ కార్యక్రమాల ద్వారా పొగాకు, మాదక ద్రవ్యాలు/మాదక ద్రవ్యాలు గల పదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు, ప్రయోగాత్మక అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే సెంట్రల్  బోర్డ్  ఆఫ్  సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) పాఠశాల కరికులంలో జీవన నైపుణ్యాలను కూడా చేర్చింది. ఈ జీవన నైపుణ్యాలు విద్యార్థులు పొగాకు ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండడాన్ని అలవరుస్తాయి. అంతే కాదు సిబిఎస్ఇ 8, 9, 11 తరగతుల సిలబస్  లో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఏర్పడే దుష్ర్పభావాల గురించి పాఠ్యాంశాల్లో చేర్చింది. అలాగే పొగాకు ఉత్పత్తుల దుష్ర్పభావంపై విద్యార్థుల్లో చైతన్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలంటూ సిబిఎస్ఇ తన అనుబంధ పాఠశాలలకు సర్కులర్లు జారీ చేసింది.

దీనికి తోడు విద్యా శాఖ రూపొందించిన ‘‘పాఠశాల భద్రత, సెక్యూరిటీ మార్గదర్శకాలు’’ కింద పాఠశాల నిర్వహణలో బాధ్యతాయుత వైఖరికి సంబంధించిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్  పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, సెక్యూరిటీ కోసం ఆ రంగంలో భాగస్వాములైన అందరినీ, విభిన్న శాఖలను భాగస్వాములను చేస్తుంది. ఈ మార్గదర్శకాలు  స్వభావరీత్యా సలహాల కిందకు రావడమే కాకుండా పాఠశాల ప్రాంగణాలకు 100 అడుగుల దూరంలో పొగాకు, హానికరమైన ఉత్పత్తుల విక్రయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాలలు, పాఠశాల యాజమాన్యాలపై ఉంటుంది.

అంతే కాదు, నార్కోటిక్  కంట్రోల్  బ్యూరో (ఎన్ సిబి),  సంబంధిత మంత్రిత్వ శాఖలు, భాగస్వాముల సహకారంతో బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్ సిపిసిఆర్) ‘‘బాలల్లో మాదక ద్రవ్యాలు, సంబంధిత పదార్థాల వినియోగం; అక్రమ రవాణా’’కు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. బాలలను మత్తు  పదార్థాల దుర్వినియోగం నుంచి దూరంగా ఉంచడంతో  పాటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాల సమీపంలో మాదక ద్రవ్యాల విక్రయం నిలువరించడానికి; మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగాన్ని నిలువరించడంలో సమగ్ర వైఖరి అనుసరించడం కోసం రూపొందించిన విధాన పత్రం ఇది. ఫార్మా ఔషధాలు, విషపూరిత పదార్థాలు బాలలకు దూరంగా ఉంచేందుకు కొన్ని వ్యూహాత్మక చొరవలు కూడా ఇది అమలుపరుస్తుంది.

పాఠశాలలు, విద్యా  సంస్థల్లో ‘‘ప్రహారీ క్లబ్’’ల ఏర్పాటు;  పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో వివిధ రకాల విద్యార్థుల క్లబ్ ల ఏర్పాటు కూడా ఈ కార్యాచరణ ప్రణాళికలో ఉంది. ఎన్ సిపిసిఆర్ వెబ్  సైట్  లోని  ఈ దిగువ లింక్  లో ఈ ఉమ్మడి కార్యాచరణ అందుబాటులో ఉంది.

https://ncpcr.gov.in/showfile.phplang=1&level=1&sublinkid=2122&lid=2022.

 

మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.

 

***


(Release ID: 1947688) Visitor Counter : 151
Read this release in: English , Urdu , Manipuri , Tamil